బెంగాల్ పోర్టల్‌ను ఆవిష్కరించిన వన్‌ఇండియా

తూర్పు భారతదేశంలో కూడా వన్ ఇండియాను విస్తరించాలనే ఉద్దేశంతో బెంగాళీ ప్రజలకు పోర్టల్ సేవలు అందిస్తోంది. బెంగాళీ సైట్ అన్ని వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తూ 24గంటల పాటు సేవలందిస్తుంది. అంతేగాక బ్రేకింగ్ న్యూస్, స్టోర్ట్స్, రాజకీయ అంశాలతో కూడిన వార్తలు, కథనాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ముఖ్య పరిణామాలను బెంగాళీ ప్రజల ముందు ఉంచుతుంది. సినిమా వార్తలు, జోక్స్, ఫొటో గ్యాలరీ, వీడియోలను ఈ సైట్ ద్వారా వీక్షించించవచ్చు.
వన్ ఇండియా యాజమాన్యమైన గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ పివిటి లిమిటెడ్ సిఈఓ శ్రీరామ్ హెబ్బార్ బెంగాలీ సైట్ (http://bengali.oneindia.com) ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు. గుజరాతీ ఎడిషన్‌ను ప్రారంభించిన సమయంలోనే తాము మరిన్ని ప్రాంతీయ భాషల్లో వన్ ఇండియా సైట్‌ను ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం బెంగాళీ పాఠకులకు వన్ ఇండియా బెంగాళీ సైట్‌ను అందిస్తున్నామని చెప్పారు. భారత ఉపఖండంలో ప్రజలు ఎక్కువగా మాట్లాడే రెండో భాష అయిన బెంగాళీలో తమ సైట్‌ను ప్రారంభించడం ఎంతో గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు శ్రీరామ్ హెబ్బర్ తెలిపారు. తమ సైట్‌ను సందర్శించడం ద్వారా సాంస్కృతిక, సామాజిక, వారసత్వం మొదలైన అంశాలకు సంబంధించిన విషయాలను బెంగాళీలు తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
సొషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్ల ద్వార కూడా వన్ ఇండియా బెంగాళీ సైట్‌ను అనుసరించవచ్చు.బెంగాళీ సైట్‌ను బాధ్యతాయుతంగా తీసుకున్న యాజమాన్యం మెరుగైన విధంగా రూపొందింంచారు. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ సదూపాయం ఉంటే వాటిలో కూడా సైట్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications