రాయాలనే ఆసక్తి ఉంటే చాలు: మీకు ఇదే సరైన వేదిక
రాయాలనే ఆసక్తి, రాయడంలో నైపుణ్యం ఉంటే చాలు, మీరు చేయాల్సిందల్లా కథనాలు రాసి పంపడమే. మీకు వన్ ఇండియా తెలుగు మంచి వేదికను కల్పిస్తోంది. వివిధ అంశాలపై మీ నుంచి ఆర్టికల్స్‌ను ఆహ్వానిస్తోంది.
వన్ ఇండియా తెలుగు ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్స్‌కు మంచి వేదికగా మీ ముందుకు వచ్చింది. రాజకీయాలు, వివిధ రంగాలకు చెందిన అంశాలపై మీరు కథనాలను రాసి పంపించవచ్చు.
మీరు తెలుసుకోవాల్సింది..
సమాచారంతో కూడిన ఉత్తమ ప్రమాణాల కథనాలు
మీరు ఎంపిక చేసుకునే కథనాలు ఆకట్టుకునే విధంగా, అర్థవంతమైన శీర్షికలతో, విలువైన విషయాలతో కూడి ఉండాలి. అవి పాఠకులను ఆకట్టుకునే విధంగా పలు విశేషాలను, విశిష్టతలను లోతుగా వివరించాలి. ఉత్తమమైన స్పష్టతతో కూడిన వ్యాకరణ దోషాలు లేని కథనాల కోసం మేం చూస్తున్నాం.
ఎత్తిపోతలు వద్దు...
కాపీ కథనాలను ఎక్కడా ఆమోదించరు. మేం అందుకు మినహాయింపు కాదు. కాపీ చేసి పంపే వార్తలు వద్దే వద్దు. రచయితల విశ్వసనీయతను, సమగ్రతను మేం ఇష్టపడుతాం. ఇతర వెబ్‌సైట్ల నుంచి గానీ ఇతర వనరుల నుంచి గానీ కాపీ చేసి పంపద్దు.
ఆర్టికల్స్ ఫార్మాట్ ఇదీ...
ఆర్టికల్ నిడివి కనీసం 700 పదాలతో ఉండాలి. తెలుగు భాషలో ఉంటే పూర్తి కథనం ఉంటే మంచిది. అర్థం కాని ఎస్ఎంఎస్ భాష వాడకూడదు.
మా సైట్‌లో ఇది వరకే అచ్చయిన అంశాల మీద రాయకూడదని మనవి చేస్తున్నాం. ఎందుకంటే అది గతానుగతికంగానూ విసుగు తెప్పించేదిగానూ ఉంటుంది.
ఆ విధమైన ఆర్టికల్స్‌ను వీక్షించడానికి పైన సెర్చ్ ఆప్షన్ వాడండి.
మాకు ఎందుకు రాయాలని మీరు అడగవచ్చు
అవును, మీ రచనా నైపుణ్యాలను ప్రదర్శించడానికి, తగిన ఆదాయం సమకూర్చుకోవడానిికి ఇదే మీకు సరైన వేదిక. మీ ఆర్టికల్స్‌కు పాఠకుల సంఖ్య ఎక్కువగా ఉంటే తగిన ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది.
ఈ మెయిల్ అడ్రస్‌కు సంప్రదించండి
ఈ కింది వాటిలో మీరు ఏ రంగంపై ఆర్టికల్స్ రాయడానికి ఆసక్తి చూపుతున్నారో కూడా తెలియజేయండి.
- జీవనశైలి
- మొబైల్
- సాంకేతికాంశాలు
- ఆటో మొబైల్స్
- పర్యాటక రంగం












Click it and Unblock the Notifications