ఇస్రో.. పక్కా కమర్షియల్: నింగిలోకి ఒకేసారి 36 శాటిలైట్స్
ఇస్రో మరో రికార్డు సృష్టించనుంది. ఒకేసారి 36 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించనుంది. వన్ వెబ్ కు చెందిన శాటిలైట్లు అవి.
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో రికార్డును సృష్టించడానికి సన్నద్ధమౌతోంది. కమర్షియల్ బాట పట్టిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో మరో ముందడుగు వేయనుంది. ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది ఇస్రో. అవన్నీ వన్ వెబ్ ఇంటర్నెట్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు.
బ్రాడ్ బ్యాండ్ సేవలను మరింత మెరుగుపర్చడానికి జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్ వర్క్ శాటిలైట్లను ప్రయోగించడానికి ఇస్రో సహకారాన్ని తీసుకోనుంది వన్ వెబ్ ఇంటర్నెట్. ఇది- బ్రిటన్ కు చెందిన కంపెనీ. ఇదివరకు కూడా ఇదే కంపెనీకి చెందిన శాటిలైట్లను ప్రయోగించింది ఇస్రో. లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా వాటన్నింటినీ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. ఈ శాటిలైట్లను ప్రయోగించడానికి లాంచ్ వెహికల్ మార్క్-3ని ఉపయోగించనుంది ఇస్రో.

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆయా ఉపగ్రహాలను ప్రయోగించనుంది ఇస్రో. ఈ ప్రయోగం ఎప్పుడు ఉంటుందనేది తెలియరావట్లేదు. దీనికి సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ నెలాఖరులో ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. నిజానికి- ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో రష్యా సహాయాన్ని కోరింది వన్ వెబ్ సంస్థ. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో- అంతరిక్ష కార్యకలాపాలు, సోయుజ్ రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసింది. దీనితో ఇస్రో సహకారాన్ని తీసుకుంటోంది.
గ్లోబల్ బ్రాడ్ బ్యాండ్ కవరేజీని మరింత మెరుగుపర్చడానికి 588 ఉపగ్రహాల ప్రారంభించాలంటూ వన్ వెబ్ సంస్థ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. ఉక్రెయిన్ తో సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా తన అంతరిక్ష ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల కొంత మేర జాప్యం ఏర్పడింది. దీనితో వన్ వెబ్ కంపెనీ- ఇస్రోతో పాటు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications