టచ్ ఉద్దేశ్యమేమిటో ఆమె చెప్పాల్సిందే: హైకోర్టు

Only girl can decide nature of touch: HC
ముంబై: ఆసభ్య ప్రవర్తన కేసులో నిందితుడు ఏ ఉద్దేశంతో తాకాడనే విషయాన్ని బాదితురాలి వాదన నిర్ణయించాల్సి ఉంటుందని బొంబాయి హైకోర్టు తేల్చి చెప్పింది. ముంబైలోని ప్రజాదరణ పొందిన గొలుసుకట్టు క్లాసుల యజమానికి వెసులుబాటు కల్పించడానికి నిరాకరిస్తూ కోర్టు ఆ వ్యాఖ్య చేసింది.

ఓ విద్యార్థిని తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఛటే కోచింగ్ క్లాసులలకు చెందిన మచీంద్ర ఛటే దాఖలు చేసుకున్న పిటిషన్‌పై గురువారం జస్టిస్ నరేష్ పాటిల్, జస్టిస్ విఎల్ అచ్లియాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు విద్యార్థిని చేసిన ఫిర్యాదులో అతనిపై చార్జిషీట్ కూడా దాఖలైంది.

ఈ సంఘటన నిరుడు జనవరి 30వ తేదీన జరిగింది. తరగతిలో బోధనపై ఫిర్యాదు చేయడానికి హెచ్‌ఎస్‌సి విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు దాదర్ కార్యాలయంలో కలిసినప్పుడు ఆ సంఘటన చోటు చేసుకుంది.

ఛటేపై అమ్మాయి తల్లిదండ్రులు చేయి చేసుకున్నారని, దాంతో ఆయన ఫిర్యాదు చేశారని, ఆ సమయంలో విద్యార్థిని కూడా ఫిర్యాదు చేసినట్లు ఛటే దృష్టికి వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది కె హోలాంబే పాటిల్ వాదించారు. ఘర్షణ జరిగిందని, అటువంటప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణకు అవకాశం ఎలా ఉంటుందని ఆయన అన్నారు. అంత మాత్రాన అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి తాము నిర్ధారణకు రాలేమని కోర్టు చెప్పింది.

తన భుజం ఓ వ్యక్తి చేయి వేసినప్పుడు దాని స్వభావం ఏమిటనేది మహిళ చెప్పాల్సిందేనని, అది స్నేహపూర్వకంగా లేదా సోదరప్రేమతోనా లేదా పితృస్వభావంతోనా అనేది ఆమె చెప్పాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+