ఎవరితోనైనా పొత్తుకు రె‘ఢీ’: ఎస్ఏడీ సంయుక్త్. కాంగ్రెస్, ఎస్ఏడీ తప్ప
వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పార్టీలు ప్రిపేర్ అవుతున్నాయి. పొత్తులు, ఎత్తులపై ఫోకస్ చేశాయి. ఇటీవల అమరీందర్ సింగ్ తాము అంతా కలిసి పోటీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దానికి బలం చేకూరేలా.. శిరోమణి అకాళీదల్ (సంయుక్త్) ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్ ధింసా మట్లాడారు. అమరీందర్ చెప్పినట్టు తామంతా కలిసి పోటీచేస్తానమని వివరించారు. అయితే ఎస్ఏడీ, కాంగ్రెస్‌తో మాత్రం తమ పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు.
తాము ఒంటరిగా పోటీ చేయమని.. కూటమిగా కలిసి బరిలోకి దిగుతామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి హై కమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. అమరీందర్ సింగ్ పార్టీ, బీజేపీ కలిసి చర్చలు జరిపే అవకాశం ఉంది. పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని.. ఆ తర్వాతే మీడియాకు తెలియజేస్తామని తెలిపారు. ఇప్పటివరకు అమరీందర్‌తో మాట్లాడలేదని చెప్పారు.

ఇప్పటికే బీజేపీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించనుంది. ఇటీవల అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. దేవుడి కరుణిస్తే.. బీజేపీ, ఎస్ఏడీ సంయుక్త్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం అంతా బాగుందని.. ప్రజలు తమకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి బిల్లు ఆమోదం తెలిపిన రోజే ఖట్టర్-అమరీందర్ మీట్ అయ్యారు.
ఖట్టర్‌తో రాజకీయాలు ఏమీ మాట్లాడలేదని అమరీందర్ సింగ్ తెలిపారు. కాఫీ తాగి.. ఇతర అంశాలు డిస్కష్ చేశామని వివరించారు. తాను ఎవరినీ కలిసిన రాజకీయాలు మాట్లాడనని.. ఖట్టర్ గౌరవార్థం కలిశానని చెప్పారు. ఖట్టర్‌తో సీట్ల పంపకం గురించి మాట్లాడారా అని ప్రశ్నిస్తే.. ఆ అంశం తాను ఢిల్లీ వెళ్లి మాట్లాడతానని చెప్పారు. కొద్దీ రోజుల్లో పార్టీ సింబల్ వస్తోందని.. ఆ తర్వాత తన పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తానని వివరించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ 10 రోజుల క్రితమే మొదలయ్యిందని చెప్పారు. ఈ క్రమంలోనే ధింసా కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications