వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ స్టార్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు ఖతం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : న్యూటన్ మూడో సిద్ధాంతం అమలుచేసేందుకు భారత సైన్యం సిద్ధమైంది. చర్యకు ప్రతీకార్య చర్య మొదలుపెట్టింది. పుల్వామాలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల అంతం చూసేందుకు సన్నద్ధమైంది. ఆ క్రమంలో పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను కాల్చి చంపింది. కమ్రాన్, ఘాజీ అనే ఇద్దరు టెర్రరిస్టులను అంతమొందించింది.

పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ ఏరియాలో.. సోమవారం తెల్లవారుజామున సైనికులకు టెర్రరిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఆర్మీ మేజర్ తో పాటు ముగ్గురు జవాన్లు నెలకొరిగారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆ క్రమంలో ఒక ఇంట్లో దాక్కున్న జైషే మహమ్మద్ సంస్థకు చెందిన కమ్రాన్, ఘాజీలను సైన్యం అంతమొందించింది. ఉగ్రదాడిలో 40మందికి పైగా సహచరులను కోల్పోయిన సైనికులు.. టెర్రరిస్టులపై మరింత ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అవుతున్నారు.

 operation start two terrorists killed
English summary
The Indian Army is preparing to implement Newton's third theory. Soldiers started reaction for action. It is prepared to see the end of the terrorists who have killed more than 40 jawans in Pulwama. Two Jaish e mohammed terrorists who played a key role in the Pulwama aggression shot dead and killed. Two terrorists Kamran and Ghazi shot dead in soldiers attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X