Bihar Opinion Polls: కాంగ్రెస్ కూటమికి బొక్కెట్టేసిన ప్రశాంత్ కిషోర్..!!
Bihar Opinion Polls:బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఇప్పటికే బీహార్‌లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార ఎన్డీయే కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు బీహార్ ప్రజలకు పలు తాయిలాలు వరాలు ప్రకటిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బందన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలు విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ఆసక్తిని రేపుతున్నాయి. ఇంతకీ ఒపీనియన్ పోల్స్ ఎవరికి పట్టం కడుతున్నాయి..?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.అక్టోబర్ చివరి వారంలో కానీ నవంబర్ తొలి వారంలో కానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒపీనియన్ పోల్స్ బీహార్ రాజకీయాలపై ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే తుది ఓటర్ జాబితా పూర్తయినందున తాజాగా వెలువడిన ఒపీనియన్ పోల్స్ బీహార్ ఎన్నికలపై మరింత ఇంట్రెస్ట్‌ను కలగజేస్తున్నాయి. స్పిక్ మీడియా నెట్‌వర్క్ సర్వే,జేవీసీ ఒపీనియన్ పోల్ సంస్థలు తమ ఒపీనియన్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలను చెప్పుకొచ్చాయి.

స్పిక్ మీడియా నెట్‌వర్క్ సర్వే
స్పిక్ మీడియా నెట్‌వర్క్ సర్వే సంస్థ చేపట్టిన ఒపీనియన్ పోల్స్‌లో బీహారీలు ఎన్డీయే కూటమికే స్పష్టమైన మెజార్టీ ఇస్తున్నట్లు పేర్కొంది. ఎన్డీయే కూటమి 158 సీట్లతో 46శాతం ఓటు షేరు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది.మరోవైపు కాంగ్రెస్ కూటమి 66 సీట్లతో 41శాతం ఓటు షేరును సాధించి ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని సర్వే స్పష్టం చేసింది.ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవనప్పటికీ 8శాతం ఓటు షేరు సాధిస్తుందని ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. ఇక మజ్లిస్ 4 సీట్లు దక్కించుకుంటుందని వెల్లడించిన సర్వే.. బీఎస్పీ 1 స్థానంలో గెలుస్తుందని పేర్కొంది. ఇక ఈ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు 30.5శాతం మంది తేజస్వీ యాదవ్‌కు ఓటు వేయగా.. 27.4శాతం మంది నితీష్ కుమార్‌కు మద్దతు తెలిపారు.
జేవీసీ ఒపీనియన్ పోల్
జేవీసీ ఒపీనియన్ పోల్ ప్రకారం ఎన్డీయే 131 నుంచి 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలుస్తోంది.మహాగట్బందన్‌కు 81 నుంచి 103 స్థానాలు దక్కే అవకాశం ఉంది.ఇక సీటు షేరు, లేదా పాపులారిటీలో ఈ సర్వే ప్రకారం బీహారీలు నితీష్ కుమార్‌కు సపోర్ట్ చేయగా... తేజస్వీ యాదవ్ రెండవ స్థానంకు పరిమితయ్యారు. ఈ సర్వే ప్రకారం అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ పార్టీకి 10 నుంచి 11 శాతం ఓటు షేరుతో 4-6 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా 27శాతం నితీష్ కుమార్‌కు మద్దతు తెలుపగా... తేజస్వీ యాదవ్‌కు 25శాతం, ప్రశాంత్ కిషోర్‌కు 15శాతం మంది సపోర్ట్ చేశారు.
మొత్తానికి ఒపీనియన్ పోల్స్‌ను చూస్తే బీహార్‌లో పోరు నువ్వా నేనా అన్నట్లుగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ కూటమికి ప్రశాంత్ కిషోర్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని స్పష్టమవుతోంది.సీట్ల పంపకాల సమయంలో ఏ జాతీయ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అనేదానిపై కూడా ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications