ఊహించిందే నిజమైంది: 'రజనీ' పొలిటికల్ ఎంట్రీపై ఆందోళనలు, కానీ కబాలి డిసైడెడ్!?

ఆధ్యాత్మిక భావాలున్న రజనీని.. భావ సారూప్యత పేరుతో బీజేపీ కలుపుకోవాలని చూసినా.. రజనీ ఆ దిశగా ఆలోచించే అవకాశం లేదు. దీనికి కారణం.. ఉత్తరాది పార్టీల పట్ల తమిళనాడులో ఉన్న వ్యతిరేకతే.

చెన్నై: తమిళ రాజకీయ పరిణామాలను గమనిస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం దగ్గరపడ్డట్లుగానే కనిపిస్తోంది. ఇటీవల అభిమానులతో సమావేశంలో.. సమయం వస్తే యుద్దం చేద్దామని ప్రకటించిన రజనీ.. ఇక ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేయబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో.. ముందుగా ఊహించినట్లుగానే 'రజనీ తమిళుడు కాదు' అనే అంశాన్ని తెరపైకి వచ్చి ఆయన పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ వేయాలని వ్యతిరేక వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం ఉదయం కొన్ని తమిళ గ్రూపులు పోయెస్ గార్డెన్ లోని రజనీ ఇంటి వద్ద ఆందోళన చేపట్టాయి. మహారాష్ట్రలో పుట్టిన రజనీకాంత్‌కు తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశం లేదని వారు నినదిస్తున్నారు.

తమిళుడు కానీ రజనీకాంత్ తమిళనాడులో రాజకీయాలు చేయవద్దంటూ వారు డిమాండ్ చేశారు. వ్యతిరేక గ్రూపుల ఆందోళనతో రజనీ ఇంటి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆవైపుగా వెళ్లే వాహనాలన్నింటిని తనిఖీ చేస్తున్నారు.

రజనీ నిర్ణయం కోసం బీజేపీ నిరీక్షణ:

రజనీ నిర్ణయం కోసం బీజేపీ నిరీక్షణ:

ఇదిలా ఉంటే, రజనీ పొలిటికల్ ఎంట్రీ కోసం అటు బీజేపీ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమతో కలుపుకోవడమా? లేక పొత్తు పెట్టుకుని ముందుకెళ్లడమా? అన్న వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. 'తలుపులు తెరిచే ఉన్నాయి.." అని రజనీకి పరోక్షంగా ఆహ్వానం పలికారు. ఇక మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సైతం స్వయంగా రజనీకి బీజేపీ ఆహ్వానం పలికారు.

బీజేపీతో కలిసే అవకాశం లేకపోవచ్చు!

బీజేపీతో కలిసే అవకాశం లేకపోవచ్చు!

రజనీ రాజకీయాల్లోకి వస్తే ప్రాధాన్యతనిస్తామని గడ్కరీ తెలిపారు. బీజేపీ వ్యూహం ఎలా ఉన్నప్పటికీ.. రజనీకాంత్ మాత్రం కచ్చితంగా కొత్త పార్టీతోనే బరిలోకే దిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక భావాలున్న రజనీని.. భావ సారూప్యత పేరుతో బీజేపీ కలుపుకోవాలని చూసినా.. రజనీ ఆ దిశగా ఆలోచించే అవకాశం లేదు. దీనికి కారణం.. ఉత్తరాది పార్టీల పట్ల తమిళనాడులో ఉన్న వ్యతిరేకతే.

లోకల్ సెంటిమెంట్‌కే ప్రాధాన్యత:

లోకల్ సెంటిమెంట్‌కే ప్రాధాన్యత:

లోకల్ సెంటిమెంట్ బలంగా ఉండే తమిళనాడులో తొలి నుంచి ద్రవిడ పార్టీలదే హవా. అందుకే.. జాతీయ పార్టీలేవి ఇప్పటికీ అక్కడ నిలదొక్కుకోలేకపోయాయి. అయితే ఆ సెంటిమెంటును బద్దలు కొట్టి రజనీ ద్వారా తమిళ రాజకీయాల్లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. రజనీ మాత్రం తమిళుల సెంటిమెంట్ నే అనుసరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సొంత పార్టీ ద్వారానే ఆయన రాజకీయ రంగ ప్రవేశం జరగవచ్చు.

వారం రోజుల్లో స్పష్టత:

వారం రోజుల్లో స్పష్టత:

సోమవారం జరిగిన ఆందోళనలు చిన్నపాటివే కావడంతో.. రజనీ వాటిని అంతగా లెక్క చేసే అవకాశం లేదు. తమిళనాడువ్యాప్తంగా అశేష అభిమానులున్న రజనీ.. ఆ రాష్ట్ర రాజకీయ శూన్యత భర్తీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. మరో వారం రోజుల్లో ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ రావచ్చు.

నిజానికి బీజేపీతో చేతులు కలపాలనుకుంటే.. రద్దయిన ఆర్కేనగర్ ఉపఎన్నిక సందర్భంగా.. రజనీ బీజేపీకి మద్దతు తెలిపేవాడేమో!. అప్పటికీ.. రజనీ ఇమేజ్ ను వాడుకోవాలని ప్రయత్నించిన బీజేపీ.. ఆయన తమకే మద్దతునిస్తున్నాడని ప్రచారం చేసుకుంది. అయితే రజనీ మాత్రం తాను ఏ పార్టీని సమర్థించడం లేదంటూ కుండ బద్దలు కొట్టారు.

కబాలి డిసైడ్ అయినట్లేనా?:

కబాలి డిసైడ్ అయినట్లేనా?:

ఒక్క మాటతో తమిళ రాజకీయాలను శాసించగల సత్తా ఉన్న రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. అభిమానులు తరుచుగా తమ ఆకాంక్షను వెలిబుచ్చడమే తప్పితే.. రజనీ మాత్రం ఆ ప్రస్తావనను దూరం పెడుతూ వచ్చారు. ఇటీవలి సమావేశాల్లో.. దేవుడు శాసిస్తే.. రాజకీయాలకు సిద్దమే అంటూ ఆయన ప్రకటించడం.. ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనన్న సంకేతాలను పంపించింది. చూడాలి మరి.. ఈ కబాలి భవిష్యత్తు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+