రజనీ, కమల్ సినిమాల్లో నటిస్తారు: సీఎం పళని, పన్నీర్ నిజంగానే నటిస్తున్నారు, క్యాప్టెన్ ఫైర్ !

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల్లో బాగ నటిస్తారని, ఎన్నో అవార్డులు వారికి వచ్చాయని, అయితే నిజ జీవితంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి.

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల్లో బాగ నటిస్తారని, ఎన్నో అవార్డులు వారికి వచ్చాయని, అయితే నిజ జీవితంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వారిద్దరికంటే ఇంకా బాగా నటిస్తున్నారని డీఎండీకే పార్టీ అధ్యక్షుడు, క్యాప్టెన్ విజయ్ కాంత్ ఎద్దవ చేశారు.

శనివారం చెన్నైలోని రాజ్ భవన్ లో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తో విజయ్ కాంత్ భేటీ అయ్యారు. అనంతరం విజయ్ కాంత్ మీడియాతో మాట్లాడారు. రజకీకాంత్, కమల్ హాసన్ కంటే ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం చాల గొప్ప నటులని, వారిద్దరికి ఎన్ని అవార్డులు ఇచ్చినా సరిపోదని విజయ్ కాంత్ వ్యంగంగా అన్నారు.

OPS and EPS acting in live says DMDK leader Vijayakanth

జీవితంలో ఇక ముందు ఏ రాజకీయ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనని, గతంలో చేసిన తప్పులు చాలని డీఎండీకే పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ అన్నారు. తమిళనాడులో జరిగే ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని విజయ్ కాంత్ స్పష్టం చేశారు.

ఇక ముందు తాను క్రీయాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని విజయ్ కాంత్ అన్నారు. తమిళనాడులో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని విజయ్ కాంత్ స్పష్టం చేశారు. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను మర్యాదపూర్వకంగానే తాను కలిశానని క్యాప్టెన్ విజయ్ కాంత్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+