Oracle ఉద్యోగాల ఊచకోత,ఒక్కమెయిల్ తో వేల మంది ఔట్ - కొత్త ఎగ్జిట్ బెనిఫిట్స్..!!
అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఒకే సారి 30 వేల మంది ఉద్యోగుల పై వేటు వేసింది. ఒక్క మెయిల్ తో వీరిని ఇంటికి పంపింది. అందులో భారత్ లో పని చేస్తున్న 12 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సంస్థ తమ సిబ్బందిలో 18 శాతం మేర తగ్గించు కోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, మరోసారి భారీగా ఉద్యోగుల తొలిగింపు దిశగా ఒరాకిల్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
టెక్ దిగ్గజం ఒకే సారి 30 వేల మంది ఉద్యోగులకు ఇంటికి పంపింది. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో సహా పలు దేశాల్లో పనిచేస్తున్న 1.62 లక్షల మంది ఒరాకిల్ సిబ్బందిలో 18 శాతం మందిని తీసేస్తున్నట్లు సమాచారం. అమెరికా, కెనడాల్లో తొలగించిన ఉద్యోగుల్లోనూ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఉదయం ఆరు గంటలకు వేల మంది సిబ్బందికి ఒకేసారి తొలగింపు ఉత్తర్వులు ఈమెయిల్ ద్వారా వెళ్లాయి. కంపెనీ ల్యాప్‌టాప్ లకు యాక్సెస్ కూడా నిలిపేశారు. ఈ వార్తతో మొత్తం టెక్ ప్రపంచంలో సంచలనం నెలకొంది. ఒరాకిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోతగా భావిస్తున్నారు. ఒరాకిల్ ఇండియాలో 30,000 మంది పని చేస్తున్నారు. మరో విడత కోతలు ఉంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.

మరో విడత తొలిగింపు పై కసరత్తు
కాగా, తీసేసిన ఉద్యోగులకు ముగిసిన నెల జీతంతో పాటు మరో మూడు నెలల జీతం ఇస్తారు. ఇప్పటి వరకు కంపెనీలో సర్వీసును లెక్కగట్టి ఏడాదికి 15 రోజుల జీతాన్ని అదనంగా ఇస్తారు. వీటికి తోడు మార్చి 31 తేదీ వరకు మిగిలిఉన్న అన్ని సెలవులను నగదు చేసుకోవడానికి అనుమతిస్తారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లిస్తారు. కంపెనీ నిర్దేశించిన గడువులోగా రాజీనామా చేసిన వారికే ఇవన్నీ వర్తిస్తాయి. ఆర్టీపీషియల్ ఇంటలిజెన్స్ వినయోగం పెరిగిన తరువాత దిగ్గజ సంస్థలు తమ మానవ వనరులను తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అందులో భాగంగా ఫిబ్రవరి నుంచే ఒరాకిల్ ఈ 30 వేల మంది తొలిగింపు పైన సమాచారం ఇచ్చింది. కాగా.. ఇప్పుడు ఆకస్మికంగా ఒకే మెయిల్ తో వారందరినీ తప్పిస్తున్నట్లు తేల్చి చెప్పింది. అయితే.. ఈ తొలిగింపు ఇక్కడితో ఆగిపోలేదని.. మరింత మంది పై వేటు తప్పదని సంస్థ సంకేతాలు ఇస్తోంది. దీంతో.. ఉద్యోగులు ఎప్పుడు ఎలాంటి సమాచారం వస్తుందనే ఆందోళనతో కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications