ఆన్ లైన్ లో మొబైల్ ఆర్డర్ ఇస్తే రాయి పార్శిల్

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. రూ. 1,580 చెల్లించిన వ్యక్తికి మొబైల్ ఫోన్ కు బదులుగా 400 గ్రాముల బరువు ఉన్న ఒక అందమైన రాయి పార్శిల్ వచ్చింది.

బాధితుడు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఘజియాబాద్ లోని కారు షో రూంలో బసంత్ శర్మ ఉద్యోగం చేస్తున్నాడు.

ఇతను ఈనెల 11వ తేదిన ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ ఆర్దర్ ఇచ్చాడు. తరువాత 15వ తేది శుక్రవారం డెలివరి బాయ్ వచ్చి బసంత్ శర్మ దగ్గర రూ. 1,580 తీసుకుని పార్శిల్ ఇచ్చాడు. పార్శిల్ తీసిన బసంత్ షాక్ కు గురైనాడు. పార్శిల్ లో మొబైల్ ఫోన్ కు బదులుగా రాయి ఉండటంతో డెలివరిబాయ్ ను నిలదీశాడు.

orders cell phone online gets stone in packet in ghaziabad

తన డబ్బు తనకు ఇచ్చేయాలని బసంత్ డిమాండ్ చేశాడు. అయితే పార్శిల్ బాయ్ డబ్బు వెనక్కి ఇవ్వడానికి నిరాకరించాడు. తరువాత ఆ కంపెనీ కస్టమర్ కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చాడు. అక్కడికి ఫోన్ చేస్తే అదే సమాధానం వచ్చింది.

డబ్బు తిరిగి ఇవ్వడానికి కస్టమర్ కాల్ సెంటర్ నుండి స్పందన లేకపోవడంతో బసంత్ రాయితో పాటు పార్శిల్ డబ్బా తీసుకుని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. పార్శిల్ బాయ్ మాత్రం తనకు ఏమి తెలియదని సమాధానం ఇచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+