పలుమార్లు రేప్ చేసి యాసిడ్ తాగించాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ సంఘటన చోటు చేసుకుంది. పలుమార్లు అత్యాచారం చేసి, విషద్రవాలు తాగించడంతో 14 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మరణించింది.

ఆ సంఘటనతో ఢిల్లీ మహిళా కమిషన్ కేంద్ర ప్రభుత్వంపై, ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఎంత మంది నిర్భయలు బలి కావాలని అడిగింది. మనం మరో నిర్భయ కోసం అతి మామూలుగా ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించింది. ఇంత నిస్సహాయతను ఎప్పుడూ అనుభవించలేదని డిసిడబ్ల్యు చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

Organs destroyed, 14-year-old raped Dalit girl dies in Delhi hospital

విషద్రవం తాగించడంతో అది బాలిక లోపలి అవయవాలను పూర్తిగా తినేసిందని, అత్యంత బాధాకరంగా బాలిక మరణించిందని ఆమె అన్నారు. తాము డిసిపి (నార్త్)కి నోటీసు ఇచ్చిన తర్వాతనే స్వేచ్ఛగా తిరుగతున్న నిందితుడిని అరెస్టు చేశారని అన్నారు.

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో మహిళల భద్రత కోసం ఉన్నత స్థాయి మంత్రిత్వ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. మృతురాలి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉందని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 14-year-old Dalit rape victim who was repeatedly sexually assaulted and was forced to drink a corrosive substance, died at a hospital in Delhi on Sunday, prompting an anguished DCW chief to lash out at the Centre and Delhi police on the issue of women’s safety.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి