ఇరాన్ పై మళ్లీ విరుచుకుపడుతున్న అమెరికా
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మళ్లీ తీవ్రతరమైంది. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా వైమానిక దళం విరుచుకుపడింది. మిస్సైళ్లు, డ్రోన్ లతో విధ్వంసాన్ని సృష్టించింది. ఈ తాజా దాడులను ఇరాన్ ధృవీకరింది కూడా. ప్రతి దాడులను ఆరంభించినట్లు వెల్లడించింది. హోర్ముజ్ జಲసంధిలో అమెరికా డెస్ట్రాయర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఈ పరిణామాలు- పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది.
తాజాగా అమెరికా ఇరాన్ లోని ఖేషమ్, బందర్ అబ్బాస్‌ల పోర్టులపై దాడి చేసింది. ఇరాన్ మినాబ్ నగరంలోనూ పేలుళ్లు వినిపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని లవ్ ట్యాప్ గా అభివర్ణించారు. మున్ముందు ఈ దాడులు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. హోర్ముజ్ స్ట్రెయిట్ పై ఇరాన్ అనుసరిస్తోన్న వైఖరికి నిరసనగా తాము ఈ సైనిక చర్యకు దిగినట్లు వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించట్లేదని విమర్శించారు.

ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది. ఏ క్షణమైనా టెహ్రాన్ పై అమెరికా దాడులు చేయవచ్చని భావిస్తోంది. ఈ దాడులను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ధ్రువీకరించింది. మే 7వ తేదీన హోర్ముజ్ జలసంధి గుండా ఒమన్ గల్ఫ్ వైపుగా వెళ్తున్న అమెరికా నౌకాదళ డెస్ట్రాయర్‌లపై ఇరాన్ అనేక క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలను పంపిందని సెంట్ కామ్ తెలిపొంది. దీన్ని కాల్పులు విరమణ ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణించింది.
ఈ దాడులను నిలువరించింది అమెరికా సైన్యం. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. క్షిపణి, డ్రోన్లను ప్రయోగించింది. ఖేషమ్, బందర్ అబ్బాస్ పోర్టులు, మినాబ్ సిటీ, ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, గూఢచార నిఘా కేంద్రాలపై దాడి చేసినట్లు అమెరికా వివరించింది. ఇరాన్ దాడుల వల్ల అమెరికా నౌకలకు ఎటువంటి నష్టం జరగలేదని కూడా స్పష్టం చేసింది. కాల్పలు విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని సెంట్ కామ్ వ్యాఖ్యానించింి.
హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని సిరిక్ ప్రాంతంలో భారీ పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ వార్తా సంస్థ మెహర్ వెల్లడించింది. మినాబ్ సిటీ కూడా ఇలాంటి పేలుళ్లు సంభవించాయని వివరించింది. దీనివల్ల ఎంత మేర నష్టం వాటిల్లిందనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. టెహ్రాన్ పై మాత్రం ఎటువంటి దాడులు చోటు చేసుకోలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై స్పందించారు. ట్రూత్ సోషల్‌లో సమాచారాన్నిపోస్ట్ చేశారు. తమ మూడు అత్యాధునిక డెస్ట్రాయర్లు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటాయని ప్రకటించారు. వాటిపై దాడి జరిగినా, ఎటువంటి నష్టం సంభవించలేదని స్పష్టం చేశారు. ఇరాన్ కు చెందిన అనేక చిన్న పడవలను సముద్రంలో ముంచేశామని తెలిపారు. తమ డెస్ట్రాయర్లపై క్షిపణులను ప్రయోగించినా, వాటిని అడ్దుకుని సులభంగానే కూల్చేశామని, డ్రోన్లను కూడా గాలిలోనే ధ్వంసం చేశామని ట్రంప్ వివరించారు.












Click it and Unblock the Notifications