అమిత్ షా OROPకి ODOMOSతో కౌంటర్ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా..ఇంతకీ ఓడోమస్ అంటే ఏమిటి..?
వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) అంటే కాంగ్రెస్‌కు"వన్ రాహుల్ గాంధీ వన్ ప్రియాంకా గాంధీ" అని అమిత్ షా కొత్త భాష్యం చెప్పిన కొన్ని గంటల్లోనే జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. ఓడోమస్ (ODOMOS)నుంచి దేశం చాలా బాధపడుతోందని వెంటనే దీనికి విరుగుడు కావాలని ఆయన ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఓడోమస్ (ODMOS)అంటే "ఓవర్ డోస్ ఆఫ్ ఓన్లీ మోడీ ఓన్లీ షా" అని చెప్పారు. అంటే దేశంలో మోడీ, అమిత్ షాలకు డోస్ ఎక్కువైందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. అయితే ఓడోమాస్ అనేది దోమలకోసం వాడే ఆయింట్‌మెంట్.

బీజేపీ అధికారంలోకి వచ్చిన ఒక ఏడాదికే మోడీ దేశ సైనికులకు ఇచ్చిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP)హామీని నెరవేర్చారని అమిత్ షా హిమాచల్ ప్రదేశ్‌లో అన్నారు. కానీ 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడు సైనికులను పట్టించుకోలేదని హస్తం పార్టీకి OROP అంటే వన్ రాహుల్ వన్ ప్రియాంకా అని ఎద్దేవా చేశారు.

While the rest of the country suffers from too much ODOMOS - overdose (of) only Modi only Shah. https://t.co/PD1GoJbcIz
— Omar Abdullah (@OmarAbdullah) January 28, 2019
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఒక ఏడాదికే మోడీ దేశ సైనికులకు ఇచ్చిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP)హామీని నెరవేర్చారని అమిత్ షా హిమాచల్ ప్రదేశ్‌లో అన్నారు. కానీ 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడు సైనికులను పట్టించుకోలేదని హస్తం పార్టీకి OROP అంటే వన్ రాహుల్ వన్ ప్రియాంకా అని ఎద్దేవా చేశారు.

Click it and Unblock the Notifications