AR Rahman: RRR పై ఏఆర్ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు..!
భారత్ నుంచి సరైన సినిమాలు ఆస్కార్‌కు పంపడం లేదని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు.
అంతర్జాతీయ వేదికపై రెండు ఆస్కార్ అవార్డులను భారత్ దక్కించుకుని దేశమంతా సంబురాలు చేసుకుంటున్న వేళ ప్రముఖ సంగీత దర్శకులు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి సరైన సినిమాలు ఆస్కార్‌కు పంపడం లేదని అన్నారు.ఆస్కార్ అవార్డుల ఈవెంట్ కంటే ముందుగా జరిగిన ఓ కార్యక్రమంలో ఏఆర్ రెహ్మాన్ పాల్గొన్నారు. మ్యూజిక్ పై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడుతూ ఈ దిగ్గజ సంగీత దర్శకుడు పై వ్యాఖ్యలు చేశారు. సంగీతంలో వైవిధ్యం కనబర్చాలనే ఉద్దేశంతోనే పాశ్చాత్య దేశపు సంగీతంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు రెహ్మాన్ చెప్పాడు.
ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ మ్యూజిక్‌లో ఎన్నో ప్రయోగాలు చేసినట్లు చెప్పాడు.అంతేకాదు తన ఇంట్లోనే సొంతంగా స్టూడియో ఉండటం వల్ల సంగీత ప్రపంచంలో మారుతున్న టెక్నాలజీని వినియోగించడం కాస్త సులభతరమైందని చెప్పారు.ఇక మ్యూజిక్ గురించి చర్చ జరుగుతున్న వేళ భారత్ నుంచి సరైన సినిమాలు ఆస్కార్ అవార్డులకు ఎంపిక చేసి పంపడం లేదని చెప్పుకొచ్చారు.తనకు అవార్డు వచ్చిందంటే తాను సంగీత ప్రపంచలో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయినట్లు వెల్లడించాడు.

సంగీత ప్రపంచం టెక్నాలజీని అలవర్చుకుంటున్న సమయంలో తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు గుర్తుచేశాడు ఏఆర్ రెహ్మాన్. ఎన్నో సార్లు ప్రయోగాలు చేసి విఫలమైనట్లు వివరించాడు.అయితే ఆ ప్రయోగాలన్నీ విఫలమైనట్లు చాలామందికి తెలియదని అవన్నీ తన ఇంట్లోని స్టూడియోలో జరిగాయని చెప్పారు. అయితే సక్సెస్ మాత్రమే ప్రజలు చూశారని చెప్పుకొచ్చారు. ఇంట్లోనే స్టూడియో ఉండటంతో విఫలమైనప్పుడల్లా తిరిగి ప్రయత్నించే వాడని చెప్పాడు. ఈ క్రమంలోనే సక్సెస్ చూసినట్లు వివరించారు.పాశ్చాత్య దేశాలు చేస్తున్న ప్రయోగాలు తామెందుకు చేయకూడదన్న ఆలోచనతో తాను కూడా వెస్ట్రన్ మ్యూజిక్ పై పట్టు సాధించినట్లు వెల్లడించాడు.పాశ్చాత్య సంగీతంను మనం వింటున్నప్పుడు... మన సంగీతంను వారు ఎందుకు వినరనే ఆలోచనతో ప్రయోగాలు చేసి విజయం సాధించినట్లు చెప్పారు.

పలు మార్లు భారత్ నుంచి ఆస్కార్‌కు సినిమాలు నామినేట్ అయ్యాయని అయితే అవి అవార్డు దక్కించుకోలేకపోయాయని గుర్తుచేశారు. ఆస్కార్ అవార్డులు దక్కించుకోవాలంటే కచ్చితంగా పాశ్చాత్య దేశాల దృష్టిలో ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు.ఇక వారు ఎలాంటి చిత్రాలు తీస్తున్నారనే దానిపై కూడా అవగాహన ఉండాలని ఏఆర్ రెహ్మాన్ చెప్పారు. రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR చిత్రం నుంచి నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చిన వేళ ఏఆర్ రెహ్మాన్ వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి.












Click it and Unblock the Notifications