వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూట్యూబ్ లో OTT వీడియో స్ట్రీమింగ్??

|
Google Oneindia TeluguNews

యూట్యూబ్ గురించి తెలియనివారు లేరు. అది లేకుండా రోజు జీవితం గడవడంలేదు. తన వినియోగదారుల కోసం సంస్థ త్వరలో కొత్త సర్వీస్ ను పరిచయం చేయబోతోంది. ఓటీటీ తరహాలో వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం యూట్యూబ్ ఆన్ లైన్ స్టోర్ ను ప్రారంభించబోతోంది. యాపిల్, రోకు వంటిసంస్థలు ఇందులో భాగస్వాములవబోతున్నాయి. యూట్యూబ్ సబ్ స్క్రిప్షన్ సేవల్లో భాగంగా కొత్త సర్వీసులు అందుతాయి. ఏడాదిన్నర కాలంగా వీడియో స్ట్రీమింగ్ సేవలకు సంబంధించి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే యూజర్లకు పరిచేయం చేస్తారని టెక్ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం అధిక సంఖ్యలో యూజర్లు శాటిలైట్ టీవీ, కేబుల్ సర్వీసులకు బదులుగా సబ్ స్క్రిప్షన్ ఆధారిత ఓటీటీ స్ట్రీమింగ్ సేవలవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో యూజర్ల అభిరుచికి తగ్గట్లుగా వినోద ప్రధానమైన సంస్థలు స్ట్రీమింగ్ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ కూడా కొత్తగా వీడియో స్ట్రీమింగ్ కోసం ఆన్ లైన్ స్టోర్ ను తీసుకురాబోతోంది.

OTT video streaming on YouTube

యూట్యూబ్ పెద్ద వీడియోల నుంచి సులువుగా షార్స్ట్ చేసుకునేందుకు ఇటీవలే కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. దీంతో కంటెంట్ క్రియేటర్స్ పెద్ద వీడియోల నుంచి 60 సెకన్లకంటే తక్కువ నిడివి ఉండే షార్స్ట్ క్రియేట్ చేయవచ్చు. ఈ ఫీచర్ ద్వారా క్రియేట్ చేసిన షార్స్ట్ కు కంటెంట్ డెవలపర్ ఎక్కువ నిడివి ఉన్న వీడియో లింక్ ను యాడ్ చేయవచ్చు. దాంతో షార్స్ట్ పూర్తయిన వెంటనే ఒరిజినల్ వీడియోకు వ్యూయర్ ను రీ డైరెక్ట్ చేస్తుందని యూట్యూబ్ వెల్లడించింది.

English summary
YouTube is going to launch an online store for OTT-style video streaming services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X