వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకి మా డోర్స్ తెరిచే ఉంటాయి: షా, రహస్యంగా పార్టీ సింబల్ డిజైన్

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే, తమ పార్టీలోకి రావాలనుకుంటే ఆయనకు తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆదివారం నాడు అన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే, తమ పార్టీలోకి రావాలనుకుంటే ఆయనకు తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆదివారం నాడు అన్నారు.

రజనీకాంత్ ఇప్పటి వరకు తన తదుపరి అడుగులు ఏమిటో చెప్పలేదు. కానీ ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా మాట్లాడారు.

amit shah

రజనీకాంత్ విషయంలో మొదట సస్పెన్స్ వీడాలని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఆయన ఏం చేస్తారో తెలియాలంటే మొదట అడుగు వేయాలన్నారు. రజనీ పార్టీలో చేరితే బీజేపీ ఆయనను సీఎం అభ్యర్థిగా చేస్తుందంటున్నారు.

రజనీ బోర్ కొట్టిస్తున్నారు: కస్తూరి, నోరు మూసుకోవాలంటూ.. ఫ్యాన్స్‌తో ఫైట్ రజనీ బోర్ కొట్టిస్తున్నారు: కస్తూరి, నోరు మూసుకోవాలంటూ.. ఫ్యాన్స్‌తో ఫైట్

కాగా, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, కొత్త పార్టీ పెడతారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. తాను రాజకీయాల్లోకి వస్తే మనీ మైండెడ్ వారికి చోటు ఉండదన్నారు.

21 ఏళ్ల క్రితం ఓ పార్టీకి మద్దతు పలికి తప్పు చేశానని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, దేవుడు ఆదేశిస్తే తాను చేస్తానని కూడా అన్నారు. మరోవైపు, రజనీకాంత్ ఎంట్రీపై బీజేపీ తమిళనాడు జనరల్ సెక్రటరీ వనతి శ్రీనివాసన్ మౌనం దాల్చారు.

రహస్యంగా పార్టీ జెండా, సింబల్

మరోవైపు, రజనీకాంత్ కొత్త పార్టీ పెడుతుందనే ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. సీనియర్ ఫ్యాన్ క్లబ్ లీడర్ సమాచారం మేరకు.. రజనీకాంత్, ఆయన టీం పార్టీ జెండా, సింబల్‌ను రహస్యంగా డిజైన్ చేస్తున్నాయి.

English summary
BJP president said that Rajinikanth first has to 'take the plunge into politics' before things can move forward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X