సెక్స్ సీన్‌లో భగవద్గీత- పారాయణం
న్యూఢిల్లీ: క్రిస్టొఫర్ నోలన్ తీసిన ఓపెన్‌హైమర్. భారీ బడ్జెట్ మూవీ ఇది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయింది. దానికి తగ్గట్టే కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే భారత్‌లో 20 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టుకుంది. వీకెండ్ ముగిసే సరికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఒప్పెన్ హైమర్ సినిమాను సుమారు 100 మిలియన్ డాలర్లతో నిర్మించారు. మన కరెన్సీతో పోల్చుకుంటే దీని నిర్మాణ వ్యయం సుమారుగా 820 కోట్ల రూపాయలు. భారత్‌లో 1,200 స్క్రీన్లల్లో విడుదలైందీ మూవీ. తొలి రోజే 2,900 షోలు ప్రదర్శించారు. అమెరికన్ న్యూక్లియర్ బాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా క్రిస్టొఫర్ నోలన్ ఓపెన్‌హైమర్ సినిమాను తీశారు.

మన్ హట్టన్ మిషన్ నేపథ్యంలో సాగుతుందీ సైన్స్ ఫిక్షన్ మూవీ. టైటిల్ రోల్‌ను సిలియన్ మర్ఫీ పోషించారు. ఫ్లోరెన్స్, రాబర్ట్ డౌనీ, ఎమిలీ బ్లంట్, మ్యాట్ డామన్, జాక్ క్వైడ్.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. క్రిస్టొఫర్ నొలన్ అభిమానులను ఈ సినిమా ఉర్రూతలూగిస్తోంది. ప్రతి సన్నివేశంలోనూ అతని మార్క్ కనిపించిందంటూ అభిమానులు సంబరపడుతున్నారు.
. @OppenheimerATOM
— Uday Mahurkar (@UdayMahurkar) July 22, 2023
To,
Mr Christopher Nolan
Director , Oppenheimer film
Date : July 22, 2023
Reg: Film Oppenheimer’s disturbing attack on Hinduism
Dear Mr Christopher Nolan,
Namaste from Save Culture Save India Foundation.
It has come to our notice that the movie…
ఈ పరిస్థితుల్లో- ఈ సినిమా సరికొత్త వివాదాలకు కేంద్ర బిందువు అయింది. ఓపెన్‌హైమర్‌లో ఓ సెక్స్ సీన్ ఉంది. హీరోయిన్‌గా నటించిన ఫ్లోరెన్స్‌తో భగవద్గీతను చేత పట్టుకుని నగ్నంగా బెడ్ వద్దకు రావడాన్ని ఇందులో చూపించారు. హీరోయిన్‌తో ఇంటిమేట్ సన్నివేశంలో హీరో సిలియన్ మర్ఫీ.. అందులోని కొన్ని పంక్తులను గట్టిగా పఠిస్తాడు.
Hindus have been celebrating the mention of the Bhagwad Gita in the Oppenheimer movie, but they are left angry and perplexed at the blatant disrespect of the Gita by Hollywood.
— Harris Sultan (@TheHarrisSultan) July 21, 2023
Mentioning holy verses while having sex is considered disrespectful and racist. #BoycottOpenheimer pic.twitter.com/Gvgi5Brsx4
ఇది దుమారానికి కారణమైంది. హిందువుల పవిత్ర గ్రంధాన్ని ఓ సెక్స్ సన్నివేశంలో చూపించడం పట్ల ధార్మిక సంఘాలు భగ్గుమంటోన్నాయి. భగవద్గీత అనేది కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంమని, ఈ గ్రంధాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారని, నిత్యం పఠిస్తుంటారని సేవ్ కల్చర్- సేవ్ ఇండియా ఫౌండేషన్ పేర్కొంది.
భగవద్గీతను చూపించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలంటూ హిందువుల తరఫున డిమాండ్ చేస్తోన్నామని పేర్కొంది. కొంతమంది ట్విట్టర్ యూజర్లు ఒప్పెన్‌హైమర్ సినిమాను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. భగవద్గీతతో కూడిన అత్యంత అభ్యంతరకరమైన సన్నివేశం ఉందని, దాన్ని తొలగించాల్సిందేనని తేల్చి చెప్పారు.
-
మరో హిట్ సినిమాతో వస్తున్న యంగ్ హీరో..ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్ మామ -
ఓటీటీలోకి యూత్ ఫుల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? -
చిరంజీవి ‘ఠాగూర్’ సినిమా విషయంలో జరిగిన పెద్ద గొడవ ఏంటి? -
చంద్రబాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? -
అట్టర్ ఫ్లాప్ అనే టాక్‌తో మొదలై చివరకు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!! -
తెలుగులో టీఆర్పీ రేటింగ్‌లో నెం.1 సినిమా ఇదే -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!!











Click it and Unblock the Notifications