నడిరోడ్డుపై అమ్మాయికి లవ్ ప్రపోజ్.. తప్పు పట్టిన మతనాయకులు, దుమారం!
నడిరోడ్డుపై.. ఫుల్ ట్రాఫిక్ లో ఓ అమ్మాయికి ఓ యువకుడు తన ప్రేమను తెలుపుతూ ప్రపోజ్ చేయడం పెనుదుమారం రేపుతోంది.
భీవండి: నడిరోడ్డుపై వాహనాలు అటూ ఇటూ రద్దీగా వెళుతున్న సమయంలో ఓ అమ్మాయికి యువకుడు తన ప్రేమను తెలుపుతూ ప్రపోజ్ చేయడం మహారాష్ట్రలోని భీవండిలో దుమారం రేపుతోంది. స్థానిక నాయకులు, మతపెద్దలు ఈ జంట చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు.
భీవండిలో ఈనెల 11న యువకుడు బురఖా ధరించి ఓ అమ్మాయికి నడిరోడ్డుపై ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఆమెను కౌగిలించుకుని తన ప్రేమను ప్రకటించాడు. ఈ అనూహ్య ఘటనను చూసి కొందరు వాహనదారులు విస్తుపోగా, మరికొందరు వారిని ఉత్సాహపరిచారు. ఇప్పుడీ వ్యవహారం వీడియో సోషల్ మీడియాలో, ఆన్ లైన్ లో పెనుదుమారం సృష్టించింది.
వైరల్ గా మారిన ఈ వీడియోపై మతపెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరూ కూడా ముస్లిం వర్గానికి చెందిన వారు. ఈ నేపథ్యంలో వారి తీరు మతాచారాలకు విరుద్ధంగా ఉందని, వారికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తామంటూ మతసంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి తీవ్ర బెదిరింపులు వస్తున్నాయని అమ్మాయి తండ్రి తెలిపారు. ఇలా వేధింపులు ఆపకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని అమ్మాయి కూడా మీడియాతో పేర్కొంది. మరోవైపు సదరు అబ్బాయి కూడా నడిరోడ్డుపై తాను చేసిన పనికి విచారం వ్యక్తం చేస్తూ.. క్షమాపణలు చెబుతూ యూట్యూబ్ లో రెండు వీడియోలు పెట్టాడు.
మత పెద్దల బెదిరింపుల నేపథ్యంలో భద్రత కల్పిస్తామని ఆ జంటకు పోలీసులు హామీ ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేసే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని, అలాగే వారి ప్రేమ వీడియోను ఆన్ లైన్ లో పోస్టు చేసిన వ్యక్తిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications