హెచ్1 బీ వీసాలు ఇండియన్స్‌కే ఎక్కువ, పెరిగిన వేతనం

అమెరికాలో హెచ్ 1 బీ వీసాలను కలిగి ఉన్నవారిలో ఇండియాకు చెందినవారే అధికమని యూఎస్‌సీ‌ఐ‌ఎస్ అధికారిక నివేదిక తెలిపింది.

వాషింగ్టన్: అమెరికాలో హెచ్ 1 బీ వీసాలను కలిగి ఉన్నవారిలో ఇండియాకు చెందినవారే అధికమని యూఎస్‌సీ‌ఐ‌ఎస్ అధికారిక నివేదిక తెలిపింది.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెచ్ 1 బీ వీసాల విషయంలో కఠినమైన నిర్ణయాలను తీసుకొన్నారు. దీంతో ఇండియాకు చెందిన వారు ఈ వీసాల విషయంలో ఐటీ కంపెనీలు కూడ ధరఖాస్తు చేసుకోవడాన్ని తగ్గించారు.

సాఫ్ట్‌వేర్ మందగమనం ప్రభావం కూడ ఈ వీసాలపై కన్పిస్తోంది. అయితే మరోవైపు వీసా నిబంధనలను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినతరం చేసింది.

స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావించి వీసాల నిర్ణయంపై కఠినతర నిర్ణయాలను తీసుకొంది.

హెచ్ 1 బీ వీసాలు కలిగినవారిలో ఇండియన్స్ అధికం

హెచ్ 1 బీ వీసాలు కలిగినవారిలో ఇండియన్స్ అధికం

హెచ్ 1 బీ వీసాలు కలిగిన ఉన్నవారు అత్యధికులు ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారని అమెరికా అధికారికంగా ప్రకటించింది. యూఎన్‌సీఐఎస్ నివేదిక తెలిపింది. గత 11 ఏళ్ళలో సుమారు 21 లక్షల మంది భారత్‌కు చెందిన ఐటీ ఉద్యోగులు హెచ్ 1 బీ వీసా కోసం ధరఖాస్తు చేసుకొన్నారని ఆ నివేదిక వెల్లడించింది.అయితే ఎక్కువమందికి అర్హతలు లేకపోవడంతో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ తిరస్కరించిందని ఆ నివేదిక స్పష్టం చేసింది.

హెచ్1 బీ వీసాలు పొందిన సగటు వేతనం 92,317 డాలర్లు

హెచ్1 బీ వీసాలు పొందిన సగటు వేతనం 92,317 డాలర్లు

హెచ్ 1 బీ వీసాలు పొందిన వారి వేతనాల సగటును చూసిట్టైతే ఈ 11 ఏళ్ళలో 92,317 డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. వారిలో అధికశాతం డిగ్రీ, పీజీలు చదివినవారే ఎక్కువగా ఉన్నారు. 2007 నుండి ఈ ఏడాది జూన్ వరకు పరిశీలిస్తే యూఎస్‌సీఐఎస్‌కు హెచ్ 1 బీ వీసాల కోసం 34 లక్షల ధరఖాస్తులు రాగా, వారిలో 21 లక్షల మంది ధరఖాస్తులు ఇండియా నుండి వచ్చినవే. ఈ కాలంలోనే 26 లక్షల మందికి హెచ్ 1 బీ వీసాలను జారీ అయ్యాయి.

భారత్ తర్వాత చైనా వారే

భారత్ తర్వాత చైనా వారే

అమెరికాలో హెచ్ 1 బీ వీసాల కోసం ధరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య ఇండియా తర్వాత చైనాదే. చైనా నుండి 2,96,313, ఫిలిఫ్పీన్స్ నుండి 85,918, దక్షిణ కొరియా నుండి 77,359 , కెనడా నుండి 68,228 ధరఖాస్తు చేసుకొన్నవారిలో ఉన్నారు.

35 ఏళ్ళ వారికే ఎక్కువ హెచ్ 1 బీ వీసాలలు

35 ఏళ్ళ వారికే ఎక్కువ హెచ్ 1 బీ వీసాలలు

హెచ్ 1 బీ వీసాల కోసం ధరఖాస్తు చేసుకొన్నవారిలో అత్యధికులు 25 నుండి 34 ఏళ్ళలోపు ఉన్నవారే అధికమని ఈ నివేదిక తెలిపింది. 20 లక్షల వీసాలు కంప్యూటర్ సంబంధమైన వృత్తుల్లో వివిధ కేటగిరిల వారికే జారీ చేసినట్టు ఈ నివేదిక వెల్లడించింది.11 ఏళ్ళలో 2 వేల మందికి పైగా ఈ హెచ్ 1 బీ వీసాలను 65 ఏళ్ళు దాటిన వారికి మంజూరు చేశారు.

పెరిగిన వేతనాలు

పెరిగిన వేతనాలు

2007లో హెచ్ 1 బీ వీసాలు ఉన్న ఉద్యోగులకు సగటున 68,159 డాలర్లగా ఉన్న వేతనాలు ప్రస్తుతం 92,317 డాలర్లుగా పెరిగింది. అమెరికా ఏటా 70 నుండి 80 శాతం విదేశీ ఉద్యోగులను భారత్ నుండే తీసుకొంటున్నట్టు నివేదిక తెలిపింది.ఈ వీసా నిబంధనలు సమీక్షిస్తోంది ట్రంప్ సర్కార్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+