పాకిస్థాన్ కు ఓవైసీ బిగ్ వార్నింగ్
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం (మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రవాదులను అంతమొందించే వరకూ ఆపరేషన్ సింధూర్ కొనసాగాలన్నారు. పాకిస్థాన్ మరోసారి ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు రజత్ శర్మా హోస్ట్ గా వ్యవహరించిన ఐకానిక్ షో ఆప్ కీ అదాలత్ లో ఓవైసీ పాల్గొన్నారు.
పహల్గాం ఉగ్రవాదానికి కారణమైన ఆ నలుగురు ఉగ్రవాదుల్ని హతమార్చేంత వరకూ ఆపరేషన్ సింధూర్ కొనసాగాలని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం (మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ మరోసారి ఏమైనా చర్యలకు పాల్పడితే ఆ దేశానికి ఈ సారి మరింత నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.

"ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తలచుకుంటే పాకిస్థాన్ లోని 9 వైమానిక స్థావరాలపై దాడి చేసే సామర్థ్యం ఉంది. కానీ అలా చేయలేదు. కేవలం రన్ వేలను మాత్రమే ధ్వంసం చేసింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని పాక్ గ్రహించాలి. ఆపరేషన్ సింధూర్ తో పాక్ అల్లాడిపోయింది. అందుకే కాళ్ల బేరానికి వచ్చింది" అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.
"పాకిస్థాన్ ఎప్పుడూ అబద్ధాలనే నమ్ముకుంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. ఆపరేషన్ సింధూర్ పై ఫేక్ ఫోటోలు చూపించి ఆ దేశ ప్రధానినే మాయ చేశారు. పాక్ ప్రధాని సైతం యుద్ధ ట్యాంకులపై ఫోటోలు దిగి భారత్ ను రెచ్చగొట్టారు. ఆ దేశానికే భారీగా నష్టం వాటిల్లింది. భవిష్యత్తులో ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు" అని ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ ఓ ఫెయిలైన దేశం అని ఓవైసీ పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆర్మీ రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెజ్ లు చేస్తోందని ప్రపంచంలో ఇలాంటి ఆర్మీ ఎక్కడా ఉండదన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇస్లాం ముసుగు వేసుకుందన్నారు. భారత్ లో మత ఘర్షణలే లక్ష్యంగా పాక్ పావులు కదుపుతోందని ఓవైసీ మండిపడ్డారు. పహల్గాం ఉగ్రవాదులను అంతమొందించే వరకూ ఆపరేషన్ సింధూర్ కొనసాగాలన్నారు.












Click it and Unblock the Notifications