బిస్కెట్స్ దొంగిలించార‌ని చిన్నారుల‌ను చిత‌క‌బాదిన య‌జ‌మాని...

బిస్కెట్స్ దొంగ‌త‌నం చేశార‌ని న‌లుగురు చిన్నారుల ప‌ట్ల ఓ షాప్ య‌జ‌మాని అత్యంత క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ పిల్ల‌ల్ని ఓ పోల్‌కు క‌ట్టేసి ఘోరంగా హింసించారు. అయితే, అక్క‌డే ఉన్న‌వారు ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పెట్ట‌గా, అది కాస్త ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

పోల్‌కు క‌ట్టేసి మ‌రీ కొట్టాడు : ఈ సంఘ‌ట‌న బీహార్‌లో చోటుచేసుకుంది. బేగుసరాయ్ జిల్లా బీర్పూర్ తాలుకాలోని ఫాజిల్పూర్ గ్రామంలో ఓ కిరాణా కొట్టు ఉంది. అయితే ఆ గ్రామంలోని నలుగురు చిన్నారులు ఈ నెల 28వ తేదీన ఆ షాప్ నుంచి కుర్ కురే, బిస్కెట్ ప్యాకెట్లను దొంగిలించారు. అయితే, ఈ విష‌యం గ‌మ‌నించిన య‌జ‌మాని ఆ పిల్ల‌ల్ని ప‌ట్టుకుని ద‌గ్గ‌ర‌లోని ఓ పోల్ ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లాడు. ఆ పోల్‌కు వారి చేతులను కట్టేసి, ఆ త‌ర్వాత వారిని అత్యంత క్రూరంగా హింసించ‌డం మొద‌లుపెట్టాడు.

Owner who crushed children for stealing biscuits...

అయితే, అక్క‌డే ఉన్న‌వారంతా ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించారే కానీ, య‌జ‌మానిని అడ్డుకునేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. ఆ సమయంలో అక్క‌డ ఉన్న కొంద‌రు ఈ సంఘ‌ట‌ను వీడియోలు తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పిల్ల‌ల్ని తీవ్రంగా చిత‌క‌బాది అనంత‌రం వారిని విడిచిపెట్టాడు. ఆ దెబ్బ‌ల‌తో ఎంతో దీన ప‌రస్థితిల్లో ఆ చిన్నారులు వారి ఇళ్ల‌కు వెళ్లారు. పిల్లల పరిస్థితి చూసి ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా, జ‌రిగిన విష‌య‌మంతా వివ‌రించారు.

విష‌యం తెలుసుకున్న త‌ల్లిదండ్రులు : అయితే, విషయం తెలుసుకున్న త‌ల్లిదండ్రులు య‌జ‌మానిపై ఎటువంటి ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డంతో అక్క‌డివారిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అయితే బాలురను పోల్ కు కట్టేసి, కొట్టిన ఘటనను అక్కడున్న పలువురు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఈ ఘ‌ట‌న కాస్త వైర‌ల్ గా మారి, చివ‌ర‌కు అక్క‌డి పోలీసుల వ‌ర‌కూ చేరింది. బాధితుల‌ను గుర్తించిన పోలీసులు వారి త‌ల్లిదండ్రుల‌ను సంప్ర‌దించారు. అయితే, ఆ షాప్ య‌జ‌మానిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వారిని కోరారు. అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో బెగుస‌రాయ్ ఎస్పీ స్పందిస్తూ.. పిల్లలపై ఈ విధంగా ప్ర‌వ‌ర్తించ‌డం త‌ప్ప‌ని, చిన్న‌పిల్ల‌ల‌పై ఇలాంటి చర్యలు తీసుకోవడం తీవ్రమైన నేరం కింద ప‌రిగ‌ణిస్తామ‌ని అన్నారు. ఆ షాప్ య‌జ‌మానిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+