• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌లో వ్యాక్సిన్‌కు లైన్ క్లియర్ -సీరం తయారీ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్‌’కు ఆమోదం

|

కరోనా మహమ్మారి కొత్త రూపాలతో పురివిప్పుతోన్న తరుణాన.. కొత్త ఏడాది తొలిరోజే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. భారతీయులకు తొలిగా అందించబోయే వ్యాక్సిన్ ను కూడా నిర్ధారించింది. కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, అందుకు అనుకూలంగా శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి..

బీజేపీలోకి 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -పాత ప్రొఫెషన్‌లోకి కేసీఆర్ -బండి సంజయ్ భారీ బాంబు

  #covishield భారత్ లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతి
   కొవిషీల్డ్ కు గ్రీన్ సిగ్నల్

  కొవిషీల్డ్ కు గ్రీన్ సిగ్నల్

  ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ భాగస్వామిగా.. బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలు కలిసి అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్' వ్యాక్సిన్ ను భారత్ లో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. ఈ మేరకు కేంద్ర నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర నిపుణుల బృందం.. ఐదు గంటల పాటు చర్చించి.. ఏ వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వాలనేదానిపై క్లారిటీ ఇచ్చింది.

  డీజీసీఐ అనుమతే తరువాయి..

  డీజీసీఐ అనుమతే తరువాయి..

  భారత్ లో అత్యవసర వినియోగానికి గానూ ఫైజర్, సీరం తదితర కంపెనీలు తమ వ్యాక్సిన్లను వాడుకోవాల్సిందిగా దరఖాస్తులు చేసుకోగా, వ్యాక్సిన్‌ సామర్థ్యం, ఎంత చురుకుగా పనిచేస్తుంది? భారత వాతావరణానికి ఏది అనుకూలంగా ఉంటుంది? ఇతరత్రా అంశాలను పరిశీలించిన కేంద్ర నిపుణుల బృందం చివరకు కోవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చింది. అయితే, నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అనుమతి ఇవ్వడమే ఇంకా మిగిలుంది. డీజీసీఐ ఒకే చెప్పిన వెంటనే సీరం వారి ‘కొవిషీల్డ్' వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఈ వారంలోనే వ్యాక్సిన్ కు తుది అనుమతుల ప్రక్రియ కూడా ముగియనున్నట్లు తెలుస్తోంది. తద్వారా

  భారత్‌లో తొలి వ్యాక్సిన్

  భారత్‌లో తొలి వ్యాక్సిన్

  దేశంలో తొలిగా అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్ గా "కోవిషీల్డ్" నిలవనుంది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ సంస్థలకు భాగస్వామిగా ఉన్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII) భారత్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 5 కోట్ల డోసులను సీరం సంస్థ సిద్దం చేసింది. భారత ప్రభుత్వానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసుని రూ.440కు అందిస్తుంది సీరం ఇన్‌స్టిట్యూట్. అదే, బహిరంగ మార్కెట్‌లో ఈ ధర రూ.700 నుంచి రూ.800 వరకు ఉండొచ్చని తెలిపింది.

  కొవిషీల్డే ఎందుకంటే..

  కొవిషీల్డే ఎందుకంటే..

  భారత ప్రభుత్వం ముందుకు పరిశీలన కోసం వచ్చిన వ్యాక్సిన్లలో ‘కొవిషీల్డ్'కు మాత్రమే మాత్రమే ఇక్కడి పరిస్థితులకు అనువుగా వాడుకునే వీలుంది. ఆక్స్ ఫర్డ్ సహకారంతో బ్రిటన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఆస్ట్రాజెనికా కంపెనీ డెలవప్ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను.. కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్ల(2నుంచి 8డిగ్రీలు) వద్ద నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత వద్ద దీన్ని ఆరునెలలపాటు నిల్వ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. దీంతో మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా సరఫరా చేసే ఆస్కారం ఉంది. దీంతో నిపుణుల బృందం దానికే మొగ్గుచూపింది. ఈ క్రమంలోనే..

  వ్యాక్సిన్ డ్రైరన్‌కు అంతా సిద్ధం

  వ్యాక్సిన్ డ్రైరన్‌కు అంతా సిద్ధం

  భారత్ లో కొవిషీల్డ్ వాడకానికి గ్రీన్ సిగ్నల్ లభించిన దరిమిలా, శనివారం (జనవరి 2న) దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్​ నిర్వహించేందుకు కేంద్రం రెడీ అయింది.అన్ని రాష్ట్రాల రాజధానుల్లో క‌నీసం మూడు ప్రాంతాల్లో ఈ డ్రైన్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్రం పేర్కొన్న‌ది. కొన్ని రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లోనూ టీకా పంపిణీ చేయ‌నున్నారు.. డ్రై ర‌న్‌లో భాగంగా డమ్మీ క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎదుర‌య్యే లోపాల‌ను అధిగ‌మించేందుకు ఈ ప్ర‌క్రియ తోడ్ప‌డ‌నున్న‌ది.

  క్రైస్తవ జగన్, డీజీపీ సవాంగ్ -రాక్షసం -జస్టిస్ రాకేశ్‌కు నీరాజనం -సీఎంకు భయం: ఎంపీ రఘురామ

  English summary
  Covidshield, the Coivd-19 vaccine developed by the University of Oxford and drug manufacturer AstraZeneca, has become the first vaccine to secure recommendation for emergency use approval in India. The recommendation was made by a government-appointed expert panel on Friday. However, the Drugs Controller General of India (DCGI) will take a final call on the matter.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X