ఇంటర్ బోర్డు రద్దు.. ఇక టెన్త్ తరువాత..!!

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయానికి సిద్దమైంది. విద్యా శాఖలో కీలక సంస్కరణ ల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇంటర్ బోర్డు రద్దు చేయాలని డిసైడ్ అయింది. ఇంటర్ ను ఇక నుంచి పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. నిపుణులతో చర్చల తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖలో భారీ సంస్కరణలకు సిద్ధమైంది. ఇప్పటివరకు 11, 12వ తరగతులకు స్వతంత్రంగా కొనసాగుతున్న ఇంటర్‌ బోర్డును రద్దు చేసి, దానిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ కీలక మార్పుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించక పోయినా.. ఈ దిశగా కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, దీనికి సంబంధించి ఇంటర్‌ బోర్డుకు కూడా సమాచారం లేదు. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలోనే ఈ నెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియను బోర్డు వాయిదా వేసింది.

 DMK- AIADMK 118 సీట్లతో వస్తే వారికే ఛాన్స్, విజయ్ కు ఇక: గవర్నర్ సంచలనం..!!
DMK- AIADMK 118 సీట్లతో వస్తే వారికే ఛాన్స్, విజయ్ కు ఇక: గవర్నర్ సంచలనం..!!
telangana-govt-may-merge-intermediate-board-with-school-education-department-as-latest-reforms

సంస్కరణల దిశగా ప్రభుత్వం అడుగులు

పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ విద్యను విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం వేగం పెంచింది. పాఠశాల, ఇంటర్‌ విద్యకు ఇకపై ఒకటే పరీక్షల బోర్డు ఉండేలా చర్యలు చేపడుతోంది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి మరో 25 రోజులు మాత్రమే ఉండటంతో ఈ మార్పులపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం రెండు శాఖలకు వేర్వేరు చట్టాలు అమల్లో ఉండటంతో వాటిని సవరించేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో త్వరలోనే ఆర్డినెన్స్‌ వెలువడే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌కు ఒకే బోర్డు ఉండాలని కేంద్ర ప్రభుత్వం గతంలో సూచన చేసింది. కాగా, ఈ మార్పులు అమల్లోకి వస్తే జూనియర్‌ కళాశాలలు కూడా పాఠశాల విద్య పరిధిలోకి చేరతాయి. ఈ విలీనంతో పలు ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్‌ను పాఠశాల విద్యలో కలపడం వల్ల డ్రాపౌట్స్ తగ్గే అవకాశముందని అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+