విజయ్ త్రిషను పెళ్లి చేసుకోబోతున్నారా..?క్లైమాక్స్‌కు విడాకుల కేసు..!
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది..ఆపేరే విజయ్.నటుడిగా వెండితెరను ఏలిన ఆయన,ఇప్పుడు రాజకీయాల్లోనూ 'తమిళగ వెట్రి కళగం'(TVK) పార్టీతో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నారు.అయితే,విజయ్ రాజకీయ విజయంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది.అదే విజయ్ రెండో పెళ్లి వార్త.
ఫ్యామిలీ కోర్టులో ఏం జరిగింది?
విజయ్ తన భార్య సంగీత నుంచి విడిపోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.దీనికి బలం చేకూరుస్తూ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో వీరి విడాకుల కేసు విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది.లోలోపల జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, సంగీతతో విజయ్ వివాహ బంధం విడిపోవడం దాదాపు ఖాయమైందని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.ఈ విడాకుల ప్రక్రియ ముగిసిన వెంటనే విజయ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారనే ప్రచారం మొదలైంది.

విజయ్ - త్రిష పెళ్లి వార్తలు.. అసలు నిజమెంత?
ఇక అసలు విషయానికి వస్తే.. విజయ్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఏకైక సమాధానం 'త్రిష'. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా, వీరి మధ్య ఏదో ఉందనే రూమర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే, తాజాగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం సృష్టించాక, హీరోయిన్ త్రిష నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది.
కేవలం అభినందనలు తెలపడమేనా లేక వీరి మధ్య కొత్త బంధం మొదలవ్వబోతోందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం "విజయ్ - త్రిషల పెళ్లి ఎప్పుడు?" అంటూ పోస్టులు పెడుతున్నారు. త్రిష కూడా ఇప్పటికీ సింగిల్‌గానే ఉండటం, విజయ్ విడాకుల కేసు క్లైమాక్స్‌కు చేరుకోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
రాజకీయాల్లో విజయం సాధించి కొత్త బాధ్యతలు చేపట్టబోతున్న విజయ్,తన వ్యక్తిగత జీవితంలో కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా?అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.ఒకవైపు జూన్ 15న కోర్టు ఇచ్చే తీర్పు,మరోవైపు త్రిషతో పెరుగుతున్న సాన్నిహిత్యం..ఈ రెండూ చూస్తుంటే తమిళనాడు రాజకీయాల్లోనే కాదు,సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక సంచలన వార్త వినే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.














Click it and Unblock the Notifications