ఎన్నికల వేళ విజయ్ - సంగీత విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్, కీలక మలుపు..!!

TVK చీఫ్ విజయ్ - సంగీత విడాకుల వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఎన్నికల ప్రచారం మరో రోజులో ముగుస్తున్న వేళ ఈ వ్యవహారం మరోసారి తెర పైకి వచ్చింది. చెంగల్పట్టు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. సంగీతకు విడాకుల వ్యవహారంలో విజయ్ భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలు పూర్తియన తరువాత ఈ కేసు కొలిక్కి రానుంది. విడాకుల ప్రక్రియ పూర్తయిన తరువాత విజయ్ తన ఫ్యూచర్ ప్లాన్ పైన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. పోటీ హోరా హోరీగా కొనసాగుతోంది. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. రేపు (మంగళవారం) సాయంత్రం పోలింగ్ ముగియనుంది. ఈ సమయంలో విజయ్ ను ఇంటి కష్టాలు వెంటాడుతున్నాయి. భార్య సంగీతతో విడాకుల వ్యవహారం కోర్టులో విచారణకు వచ్చింది. ఇరుపక్షాల అభ్యర్థన మేరకు కేసు విచారణను న్యాయస్థానం జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు విజయ్‌కు సమన్లు జారీ చేసింది. అయితే సోమవారం ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి, విచారణను వాయిదా వేయాలని కోరారు. విజయ్, సంగీత ఇద్దరూ పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారని వారి న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. విడాకులకు సంబంధించిన కీలక అంశాలైన భరణం, ఆస్తుల పంపకం వంటి వాటిపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలిసింది. ముఖ్యంగా వారి పిల్లల భవిష్యత్తు భద్రతకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన ఒప్పందానికి వచ్చారు.

vijay-is-considering-an-out-of-court-settlement-involving-a-proposed-250-crore-alimony-to-his-wife

కోర్టులో విచారణ..

కాగా, భరణం కింద విజయ్ ను దాదాపు రూ 250 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. అయితే, విజయ్ మాత్రం చివరకు రూ 50 కోట్లకు అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ ఆర్థికపరమైన వివరాలను కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో వెల్లడించలేదు. ఈ నెల‌ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని, భద్రతా కారణాలు, ఇతర కార్య క్రమాలవల్ల ఆయన కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని న్యాయవాదులు తెలిపారు. ఈ వాదనల ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కేసు విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రాజకీయంగా ఎంతో కీలకమైన ఈ సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామం మీడియాలో చర్చకు దారితీసింది. ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ విడాకుల ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+