సంచలన నిర్ణయాలు తప్పవు, ఎమ్మెల్యేలతో తేల్చేసిన స్టాలిన్- హంగ్ వేళ బిగ్ ట్విస్ట్..!!
తమిళనాడు రాజకీయాలు ఊహంచని మలుపు తీసుకుంటోంది. హంగ్ అసెంబ్లీ వేళ గవర్నర్ మెలిక తో విజయ్ క్యాంపు డైలమా లో పడింది. మెజార్టీ కోసం చివరి ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు స్పష్టత వస్తుందని భావిస్తున్న వేళ మాజీ సీఎం స్టాలిన్ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు.పార్టీ ఎమ్మెల్యేలతో తాము ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహించాల్సిందేనని.. ఈ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తప్పవని తేల్చి చెప్పారు. దీంతో.. ఇప్పుడు డీఎంకే- అన్నా డీఎంకే పొత్తు చర్చల వేళ స్టాలిన్ నిర్ణయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.
తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు విజయ్ తనకు మెజార్టీ సంఖ్యకు అవసరమైన ఆరు సీట్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు గవర్నర్ 118 సీట్ల మద్దతు తో ఎవరు ముందుకు వస్తే వారికి అవకాశం కల్పిస్తామని తేల్చి చెప్పారు. ఈ సమయంలోనే మాజీ సీఎం పళని స్వామి తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ రోజు గవర్నర్ ను కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరారు.

అటు తన పార్టీ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం స్టాలిన్ ఎమర్జెన్సీ మీట్ నిర్వహించారు. అందులో కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తాను తీసుకోబోయే కొన్ని కీలక నిర్ణయాలకు ఎమ్మెల్యేలంతా కట్టుబడాలని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అటు పళని స్వామి తమ సంఖ్యా బలం పైన గవర్నర్ తో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
విజయ్ కు మద్దతు పై నేడు స్పష్టతకు ఛాన్స్
ఇప్పటికేతై డీఎంకే, అన్నాడీఎంకే నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా జారిపోయే అవకాశం కనిపించడం లేదు. ఆ కూటముల్లోని చిన్న పార్టీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సమీకరించ డం విజయ్‌కి దాదాపు అసాధ్యంగా మారుతోంది. వామపక్షాలు విజయ్‌వైపు వెళ్లాలనే ఆసక్తి ప్రదర్శిస్తున్నప్పటికీ.. 'భవిష్యత్‌నూ దృష్టిలో పెట్టుకోండి' అని స్టాలిన్ వారికి సూటిగానే చెప్పినట్లు సమాచారం. అయితే, అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే అధిపతి స్టాలిన్ సుముఖత వ్యక్తం చేయడం లేదని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
ఆయనను ఒప్పిం ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకేను కాదని 'ద్రవిడ' పార్టీలు అధికారం చేపడితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని, విజయ్‌పై సాను భూతి పెరుగుతుందని, స్టాలిన్ శషభిషలకు ఇదే కారణమని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో.. స్టాలిన్ సై అంటే తమిళనాడు రాజకీయం ఒక్క నిర్ణయంతో మారిపోయే అవకాశం ఉంది. విజయ్ కు మెజార్టీ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.. లేదంటే జరిగే రాజకీయం మరింత ఉత్కంఠ పెంచటం ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications