కాచిగూడ నుంచి బయలుదేరి వెళ్లే ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్.. ఇకపై
వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. తాకిడికి అనుగుణంగా గతంలో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తోన్నారు. ప్రయాణికుల నుంచి అందుతున్న ఆదరణ నేపథ్యంలో వాటిని రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ గా మార్పు సైతం చేస్తోన్నారు.
ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉంటోన్నాయి. తాజాగా మరో వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును క్రమబద్దీకరించారు. ఆగస్టు 20వ తేదీ గురువారం నుంచి ఇది అమలులోకి రానుంది. తెలంగాణ, ఏపీ నుంచి తిరుపతికి వెళ్లే వారికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.

- ఈ నెల 20వ తేదీ నుంచి ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 07607 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు ఉదయం 11:55 నిమిషాలకు తిరుచానూర్ కు చేరుకుంటుంది.
- ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తిరుచానూర్ నుంచి బయలుదేరే నంబర్ 07608 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
- మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
- మొత్తం 20 బోగీలతో కూడిన రైలు ఇది. వీటిల్లో 2ఏ- 2, 3ఏ- 8, స్లీపర్- 6, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు- 4 ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.













Click it and Unblock the Notifications