నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. చంపింది ఆమె స్కూల్ విద్యార్థులే!
నల్గొండ జిల్లాలో ఒక స్కూల్ ప్రిన్సిపల్ హత్యతో దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం జేపీ కాలనీలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ స్కూల్ ప్రిన్సిపల్ కే రూప రెడ్డి ఆగస్టు 11వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆగస్టు 11న ఆమె తన ఇంట్లోనే కత్తిపోట్లతో మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్
అయితే ఈ కేసులో షాకయ్యే విషయం ఏమిటంటే వీరంతా రూపారెడ్డి ప్రిన్సిపాల్ గా ఉన్న నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులే కావటం.ఆగస్టు 11వ తేదీ రాత్రి రూపా రెడ్డి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో ముగ్గురు వ్యక్తులు పదునైన కత్తులతో ఆమె శరీరం పైన 27 చోట్ల పొడిచి చంపారు.

ఆమె స్కూల్ లో చదివిన విద్యార్థులే హంతకులు
జల్సాల కోసం అలవాటుపడిన ముగ్గురు మైనర్లు, అది కూడా రూపా రెడ్డి ప్రిన్సిపల్ గా ఉన్న నాగార్జున పబ్లిక్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులే రూప రెడ్డి ని అత్యంత దారుణంగా హతమార్చారు. పోలీసులు సీసీటీవీ పేజీల ద్వారా నిందితులను గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసిన పోలీసులు ఈ కేసులో నిందితులను పట్టుకున్నారు.
దర్యాప్తుకు మూడు ప్రత్యేక బృందాలు
మంగళవారం ఇబ్రహీంపట్నం సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. హత్య సమయంలో నిందితులు గ్లౌజులు ధరించినట్లు అనుమానం ఉండటంతో ఘటనా స్థలంలో ఆధారాలు తక్కువగా లభించాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేయగా దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. సుమారు 80 మందిని విచారించి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కీలక సమాచారం సేకరించారు.
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యవెనుక మరేదైనా కారణం ఉందా?
రూపారెడ్డి ఇంటి నుంచి సుమారు రూ.4 లక్షల నగదు కనిపించకపోవడంతో చోరీ కోసమే హత్యకు పాల్పడ్డారా అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది . ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలను బుధవారం సాయంత్రం వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications