స్థానిక సంస్థల వేళ కూటమి బిగ్ ట్విస్ట్, వైసీపీ వాట్ నెక్స్ట్..!!

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ఏకపక్షంగా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. అటు వైసీసీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ ఏం చేయబోతుందనేది కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం అధికారికంగా ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయించింది. అర్బన్ - రూరల్ ప్రాంతాల్లో ఏ మేర అమలు చేయాలో డిసైడ్ అయింది. అదే విధంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను రాబట్టేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాలని తీర్మానించింది.
చట్టంలోని నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్‌తోనే ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్‌ ఆమోదించింది.

 తిరుమల వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన - టార్గెట్ ఫిక్స్..!!
తిరుమల వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన - టార్గెట్ ఫిక్స్..!!
ap-govt-all-set-to-complete-local-body-elections-before-october-ending-as-latest-decision-in-cabin

ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు

ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రస్తుతం వారి రిజర్వేషన్లు యథతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోంది. కాగా.. ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా పెంచడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కానుంది. మూడు పార్టీలు స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాల పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, అటు వైసీపీ సైతం ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు ముఖ్య నేతలకు మాజీ సీఎం జగన్ కీలక దిశా నిర్దేశం చేసారు. అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ వరకు దసరా కావటం తో.. అక్టోబర్ తొలి వారంలో మున్సిపల్.. చివరి వారంలో పంచాయితీ ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు ఇప్పుడు కూటి - వైసీపీ మధ్య ప్రతిష్ఠాత్మక పోరుగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+