అప్పుడు సీబీఐ ఆఫీస్‌ను ప్రారంభించి.. ఇప్పుడు అరెస్టై అక్కడికే..
Recommended Video
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బుధవారం రాత్రి అరెస్టైన మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చింది. బుధవారం రాత్రి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, గతంలో కేంద్రమంత్రిగా ఉన్న చిదంబరం సీబీఐ కార్యాలయ ప్రారంభోత్సంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం గమనార్హం.
2011లో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న చిదంబరం అదే సంవత్సరం జూన్ 30న ఢిల్లీలో కొత్త సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే, 8ఏళ్ల క్రితం ఏ సీబీఐ కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారో.. అదే అదే కార్యాలయానికి చిదంబరంను అరెస్ట్ చేసి తరలించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH ANI file footage: The then Union Home Minister, P Chidambaram at the inauguration of the new Central Bureau of Investigation (CBI) headquarters in Delhi on June 30, 2011. Chidambaram was arrested by CBI yesterday and brought to this complex. pic.twitter.com/ikuxIzaSyF
— ANI (@ANI) August 22, 2019
బుధవారం రాత్రి చిదంబరంను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు గురువారం మధ్యాహ్నంలోగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో చిదంబరంను సీబీఐ అధికారులు విచారించనున్నారు.

కాగా, 2011లో చిదంబరం హోంమంత్రిగా ఉన్న సమయంలో సోహ్రాబుద్దీన్ కేసులో గుజరాత్ హోంమంత్రి అమిత్ షాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే, ఇప్పుడు హోంమంత్రిగా అమిత్ షా ఉండగా.. చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications