శారదా స్కాం: చిదంబరం భార్య నళినీకి సిబిఐ సమన్లు
న్యూఢిల్లీ: ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంకు మరో చిక్కు ఎదురైంది. దేశంలో సంచలనం సృష్టించిన శారాదా కుంభకోణం కేసులో చిదంబరం భార్య, చెన్నైకి చెందిన న్యాయవాది నళినికి సిబిఐ శుక్రవారం సమన్లు జారీ చేసింది.
మార్చి 10న కోల్‌కతాలోని సిబిఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆ సమన్లలో సిబిఐ పేర్కొంది. కాగా, మొదటి సారి ఆమె పేరును ఛార్జీషీటులో పేర్కొనడం జరిగింది. 6వ సప్లిమెంటరీ ఛార్జీషీటులో సిబిఐ ఆమె పేరును ప్రస్తావించినట్లు తెలిసింది.
నళిని పేరును సాక్షిగా లేదా నిందితురాలిగా సిబిఐ పేర్కొనలేదు. వివాదాస్పద ఛానల్ ఒప్పందం గురించి సమాచారం సేకరించేందుకు సిబిఐ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆమె నుంచి దానికి సంబంధించిన సమాచారాన్ని సిబిఐ సేకరించే అవకాశం ఉంది.

కాగా, శారదా స్కాం కేసులో నిందితుడైన మనోరంజన సింగ్ తరపున న్యాయవాది అయిన నళిని వాదిస్తున్నారు. అయితే, శారదా ఖాతా నుంచే నళినికి ఫీజు చెల్లించినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. శారదా స్కాంలో ప్రధాని నిందితుడిగా వున్న సుదీప్తో సేన్ ఏప్రిల్ 2013లో సిబిఐకి రాసిన లేఖలో న్యాయవాది నళినికి ఫీజుగా శారదా ఖాతా నుంచే డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సీబీఐ నళిని పేరును ఛార్జీషీటులో చేర్చింది.
జూన్ 21, 2010లో సుదీప్తో, శారదా గ్రూప్‌ల మధ్య ఒప్పందం కుదర్చడంలో న్యాయవాది నళిని మధ్యవర్తిగా వ్యవహరించారని సిబిఐ పేర్కొంది. న్యాయవాదిగా వారికి కావాల్సిన సేవలను నళిని అందించారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె ఎంతమొత్తం ఫీజుగా తీసుకుందో తెలుసుకోవాలనుకుంటోంది సిబిఐ. 2010-2012 మధ్య కాలంలో ఆమె రూ. 65.85 లక్షలు పొందారని విచారణాధికారులు గుర్తించారు.
కాగా, ఈ చెల్లింపునకు సంబంధించి శారదా గ్రూప్ రూ. 1.5కోట్లు టీడీఎస్‌గా చూపించినట్లు గుర్తించారు. సుదీప్తో సేన్... నళినికి పంపిన చాలా ఈమెయిల్స్‌ల గురించి సిబిఐ తెలుసుకోవాలనుకుంటోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications