సోనియా గాంధీకి మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు సోనియా గాంధీకి ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువును ప్రసాదించాలి అంటూ మోడీ అధికారిక ట్విట్టర్ లో ట్విట్ చేశారు.
పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి సోనియా గాంధీ నివాసం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యూ కట్టారు. బొకేలు, స్వీట్లు, కేక్ లు తీసుకు వెళ్లారు.
On her birthday, greetings to Congress President Smt. Sonia Gandhi. May Almighty bless her with long life & good health.
— Narendra Modi (@narendramodi) December 9, 2015 కాంగ్రెస్ కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బుధవారం సోనియా ఇంటి దగ్గర పండగ వాతావరణం నెలకొంది. అయితే కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో బలైన జవాన్లకు, చత్తిస్ గడ్ లో నక్సల్స్ దాడులకు బలైన పోలీసులకు సంతాపంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు.

అయితే వివిద రాష్ట్రాల్లో సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పాలు, పండ్లు పంచిపెట్టారు.












Click it and Unblock the Notifications