యోగికి రజనీకాంత్ పాదాబివందనం, సూపర్ స్టార్ కు అన్నామలై అండ, ఏం తప్పు చేశారు ?
చెన్నై/లక్నో/ముంబాయి: లక్నో పర్యటనకు వెళ్లి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకి వివాదంలో చిక్కుకున్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తమిళనాడు బీజేపీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై మద్దతు తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ గౌరవం చూపిస్తూ ఆయనకు పాదాబివందనం చేశారని అన్నామలై అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ మఠానికి అధిపతి అని, తరువాత ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యారని, సీఎం కాకముందే నుంచే. ఉత్తరప్రదేశ్ ప్రజలు యోగి ఆదిత్యనాథ్ ను మహారాజ్ అని పిలుస్తారని తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై చెప్పారు. అందుకే యోగి ఆదిత్యనాథ్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ పాదాబివందనం చేశారని, అందులో తప్పేముందని అన్నామలై తమిళనాడులోని డీఎంకే పార్టీ నాయకులను ప్రశ్నించారు.

అయితే దీని అర్థం ఒక వ్యక్తి మరొకరి కంటే తక్కువ అని కాదని, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని, ఆయన ఆధ్యాత్మికతను సూపర్ స్టార్ రజనీకాంత్ గౌరవిస్తారని, అందుకే ఆయన పాదాలు తాకారని, యోగి ఆదిత్యనాథ్ పై ఉన్న తన ప్రేమను, ఆప్యాయతను ఈ సందర్బంగా రజనీకాంత్ చాటుకున్నారని బీజేపీ తమిళనాడు సీనియర్ నాయకుడు అన్నామలై అన్నారు.
పనికిమాలిన కొన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకులు ప్రతి విషయాన్ని విమర్శిస్తున్నారని, అంతటితో ఆగాలని అన్నామలై సూచించారు. ఇదే సందర్బంలో అన్నామలై మాట్లాడుతూ 20 రూపాయల కోసం ఒక వ్యక్తి డీఎంకే మంత్రి అన్బిల్ మహేష్ కాళ్ళపై పడిన ఉదాహరణ కూడా ఉందని గుర్తు చేశారు. తమిళనాడు మంత్రులు చాలా మంది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కాళ్లపై పడ్డారని అన్నామలై ఇదే సందర్బంలో గుర్తు చేశారు.

ఇటీవల సీఎం ఎంకే స్టాలిన్ కాళ్లపై మంత్రులు పడిపోవడం చూశామని, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ కంటే సీనియర్ ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీలో ఆయనకు నమస్కరించారని, ఆ విషయాలు గుర్తించకుండా ఇప్పుడు డీఎంకే పార్టీ నాయకులు సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విమర్శలు ఎందుకు చేస్తున్నారు? అని అన్నామలై ప్రశ్నించారు.
యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన తర్వాత రజనీకాంత్ సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్‌ను కలిశారని అన్నామలై చెప్పారు. రాజకీయ పార్టీల నేతలతో రజనీకాంత్ సత్సంబంధాలను పంచుకున్నారని అన్నామలై తెలిపారు.యూపీ ముఖ్యమంత్రితో రజనీకాంత్ భేటీపై వీసీకే చీఫ్ తిరుమావళవన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై అన్నామలై స్పందించారు. యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకిన రజనీకాంత్ చర్య ఇలాంటి చర్చలకు దారితీసిందని అన్నారు.

జైలర్ సినిమా ప్రమోషన్ కోసమే రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పాదాబివందనం చేశారని కొందరు విమర్శిస్తున్నారు. అయితే దేశంలో ఇన్ని సమస్యలు పెట్టుకుని పనిపాటలేని కొందరు రాజకీయ నాయకులు యోగి ఆదిత్యనాథ్ పాదాలను రజనీకాంత్ ముట్టుకున్నారని రాద్దాంతం చేస్తున్నారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications