పద్మ: జయప్రద కోసం అమర్‌సింగ్ పైరవీ!, ప్రముఖులూ

Jayaprada
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ అవార్డ్స్ కోసం ప్రభుత్వానికి రికమండేషన్స్ వస్తున్నాయట. పలువురు ప్రముఖులు బంధువులను, తమ అనుచరుల పేర్లను రికమండ్ చేస్తున్నారని అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు అమర్ సింగ్ రాంపూర్ ఎంపీ జయప్రద పేరును రికమండ్ చేశారు! మొత్తంగా దాదాపు పదమూడు వందల రికమండేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

సమాచారం మేరకు... మోతీలాల్ వోరా, రాజీవ్ శుక్లా, టి సుబ్బిరామి రెడ్డి, పండిట్ జస్ రాజ్ తదితరులు పలు పేర్లను రికమండ్ చేశారు. లతా మంగేష్కర్ తన సోదరి ఉషా మంగేష్కర్, ప్లేబ్యాక్ సింగర్ సురేష్ వాడేకర్‌ల పేర్లను సూచించారు. సరోద్ ప్లేయర్ ఉస్తాద్ అమ్జత్ అలీ ఆరు రికమండేషన్స్ చేశారు.

తన ఇద్దరు కొడుకులు అమాన్, అయాన్, హిందూస్తాన్ క్లాసికల్ సింగర్ కౌషికి చక్రవర్తి, తబలా ప్లేయర్ విజయ్ ఘాతే, ఆర్ట్ ప్రమోటర్ సూర్య క్రిష్ణమూర్తి, సితార్ ప్లేయర్ నిలాద్రి కుమార్‌ల పేర్లను సూచించారు. అమర్ సింగ్ జయప్రద పేరును సూచించారు.

ప్రముఖులు సూచించిన వాటిలో కొందరి పేర్లు పద్మ అవార్డ్స్ లిస్టులో లేవు. ప్రముఖ క్లాసికల్ సింగర్ పండిట్ జస్ రాజ్ తొమ్మిది మంది, రాజీవ్ శుక్లా ఐదుగురి, మోతీలాల్ వోరా ఎనిమిది మంది, సుశీల్ కుమార్ షిండే, సల్మాన్ ఖుర్దీద్‌లు చెరో ఇద్దరి పేర్లను పంపించారు.

కాగా ఆర్టీఐ కార్యకర్త సుభాష్ ఎవరెవరు ఎవరిని రికమెండ్ చేశారో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు. కాగా, అర్హులను వరించాల్సిన ఈ పురస్కారాల కోసం వస్తున్న ఇలాంటి ప్రతిపాదనల పట్ల కేంద్ర హోంశాఖ జాగురూకతతో వ్యవహరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+