Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పహల్గాం రక్తపాతం: మతమే మృత్యువై వెంటాడిన వేళ..!!

Pahalgam Terrot Attack: కశ్మీర్ లోయలోని అందమైన పహల్గాం... పర్యాటకుల స్వర్గం. ఆ పచ్చదనం, ఆ పర్వతాలు, ఆ నిర్మలమైన నీటి ప్రవాహాలు చూసి ఆనందించడానికి వచ్చిన అమాయకపు పర్యాటకుల పాలిట అది మృత్యుకూపంగా మారింది. శాంతిని ఆశించి వచ్చిన వారిని మృత్యువు అతి కిరాతకంగా కబళించింది. మతం మారణహోమానికి దారితీసిన అత్యంత దారుణమైన సంఘటన పహల్గాంలో చోటు చేసుకుంది. ఈ దాడి కేవలం మనుషులపై కాదు, మానవత్వంపై జరిగిన దాడి.

మతమే మృత్యువైందా..?
22 ఏప్రిల్ 2025, మధ్యాహ్నం దాదాపుగా 3 గంటల సమయం. ఆ రోజు పహల్గాంలో వాతావరణం నిర్మలంగా ఉంది. దేశం నలుమూలల నుండి వచ్చిన పర్యాటకులు అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. కనీసం తమకు ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని వారు కలలో కూడా ఊహించలేదు. అకస్మాత్తుగా తుపాకుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పర్యాటకులపై విరుచుకుపడ్డారు.ఈ దాడిలో వారి కిరాతకత్వం మరో మెట్టు పైకి ఎక్కింది. వారు కేవలం కాల్పులు జరపడమే కాదు, పర్యాటకుల వద్దకు వెళ్లి వారి మతాలను అడిగి తెలుసుకున్నారు. మానవత్వం మంటగలిసిన ఆ క్షణాల్లో, వారు మతాన్ని మృత్యువుకు ప్రాతిపదికగా చేసుకున్నారు.అవును,మతమే వారికి మృత్యువుగా మారింది.

Pahalgam Bloodbath When Religion Became the Target of Terror

ఉగ్రవాదం కాదు..మతోన్మాద విషనాగుల పడగ
అంతటితో ఆగకుండా, వారు కొందరిని బలవంతంగా 'కలిమా' (ఇస్లాంలో మత మార్పిడికి సంబంధించిన ప్రక్రియ) పఠించమని ఒత్తిడి చేశారు. దానిని నిరాకరించిన వారిని కడతేర్చారు. తమ నమ్మకాలను ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించిన అమాయకులను అతి దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. ఇది కేవలం ఉగ్రవాదం కాదు, మతోన్మాద విషనాగుల పడగ విప్పుట.

అంతే కాదు, మృతుల దేహాలపై వారి అమానుషత్వం పరాకాష్టకు చేరింది. కొందరు పురుషుల ప్యాంట్లను బలవంతంగా తొలగించి, సున్తీ చేయించుకున్నారా లేదా అని పరిశీలించారు. హిందూ మతానికి చెందిన వారిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని ఈ కిరాతక చర్యలకు పాల్పడ్డారు. మానవ మలానికి కూడా సిగ్గు తెచ్చే ఈ చర్య ఉగ్రవాదుల పైశాచికత్వానికి నిదర్శనం. హిందువులను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ మారణకాండ, మతం పేరుతో ఎంతటి రక్తపాతం సృష్టించవచ్చో ప్రపంచానికి మరోసారి చూపింది.

ఐఎస్‌ఐ హస్తం?
ఈ దాడి వెనుక ఒంటరి తోడేళ్ళ ప్రమేయం లేదని స్పష్టమవుతోంది. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన కుట్రలో భాగం. ముఖ్యంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని భారత భద్రతా సంస్థలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి.ఈ దాడి తామే చేశామని నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద అనుబంధ సంస్థగా కొనసాగుతున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ప్రకటించింది.కశ్మీర్‌ను అస్థిరపరచడానికి, భారతదేశాన్ని రక్తసిక్తం చేయడానికి ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా ఐఎస్‌ఐ ఉపయోగిస్తోందనడానికి ఈ పహల్గాం దాడి మరో సాక్ష్యం. అమాయక పర్యాటకులను, అది కూడా వారి మతాలను అడిగి మరీ చంపడం ఐఎస్‌ఐ జిహాదీ ఎజెండాలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముష్కరుల దాడిలో నేలకొరిగిన విశాఖ,నెల్లూరు వాసులు
పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అమరులయ్యారు. వీరిలో ఒకరు విశాఖకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి. ఉగ్రవాదులు దాడిని చూసిన చంద్రమౌళి ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీస్తుండగా.. ఆయన్ను వెంటాడీ మరి చంపారు ముష్కరులు.తనను చంపొద్దని చంద్రమౌళి వేడుకున్నారు. అయినా సరే కించిత్ కనికరం లేకుండా తూటాలు గుండెల్లోకి దింపారు దుర్మార్గులు.చంద్రమౌళి పార్థివ దేహం విశాఖకు చేరుకుంది. ఆయన భౌతికకాయాన్ని చూడగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం చంద్రబాబు చంద్రమౌళి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఇక నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్ రావు ముష్కరుల దాడిలో నేలకొరిగారు.మధుసూదన్ రావు భౌతికకాయాన్ని బుధవారం రాత్రి చెన్నై ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి గురువారం ఉదయం రోడ్డు మార్గంలో కావలికి తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లి దండ్రులు వృద్ధులు కావడంతో ముందుగా మధుసూదన్‌ ఉగ్రదాడిలో మరణించారని చెప్పలేదు. గాయాలయ్యాయని మాత్రమే చెప్పారు. అయితే చాలా సమయం తర్వాత మధుసూదన్ ఇక లేరన్న వార్త తెలియగానే తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. వారిని ఆపడం ఎవరి తరం కాలేదు.మధుసూదన్ పార్థివదేహాన్ని చూసేందుకు కావలి తరలివచ్చింది. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.మంత్రులు ఆనం, నారాయణలు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

పహల్గాం రక్తపాతం భారతదేశపు మనసులో ఎప్పటికీ చెరగని గాయం. మతం మారణహోమానికి దారితీసిన ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. పర్యాటకుల రూపంలో వచ్చిన అమాయకులను బలి తీసుకున్న ఈ ఉగ్రవాదులపై, వారి వెనుక ఉన్న శక్తులపై ప్రపంచ దేశాలు ఏకమై పోరాడాలి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పహల్గాంలో నేలకొరిగిన అమాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ దుర్ఘటన మనందరికీ ఒక కనువిప్పు కావాలని ఆశిద్దాం. ఉగ్రవాదం నిర్మూలించబడాలి, మానవత్వం తిరిగి గెలవాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+