Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అడ్డంగా దొరికేశారు: పాక్ కుట్ర బట్టబయలు..ఇవే రుజువులు

పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరోసారి అడ్డంగా బుక్కైంది. గత నెల ఫిబ్రవరిలో పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో భారత వాయుసేన వెంటనే పసిగట్టి ఆ యుద్ధ విమానాలను తరిమిగొట్టింది. అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వచ్చిన సమయంలో తాము ఎఫ్-16 యుద్ధ విమానాలు వినియోగించలేదని ప్రపంచదేశాలను నమ్మించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ పచ్చి అబద్ధాలు ఆడుతోందనే విషయాన్ని ఓ జాతీయ ఛానెల్ తమ ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటపెట్టింది.

భారత గగనతలంలోకి వచ్చిన యుద్ధ విమానాలు ఎఫ్ 16 కాదు: పాక్

భారత గగనతలంలోకి వచ్చిన యుద్ధ విమానాలు ఎఫ్ 16 కాదు: పాక్

భారత్ కూల్చిన యుద్ధ విమానంకు సంబంధించిన శకలాలను కూడా భారత వాయుసేన మీడియా ముందు ప్రదర్శించింది. అయితే అది తమది కాదని అసలు ఎఫ్ 16 యుద్ధ విమానాలను వినియోగించలేదని చెబుతూ వచ్చింది. కానీ జాతీయ ఛానెల్ బయట పెట్టిన విషయాలను చూస్తే పాక్ పచ్చిగా అబద్ధాలు ఆడినట్లు తెలుస్తోంది. భారత గగన తలంలోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాలు కచ్చితంగా ఎఫ్-16 యుద్ధ విమానాలే అనే సంగతి బయటపడింది. ఈ యుద్ధ విమానాన్ని నడిపిన పాక్ వింగ్ కమాండర్ నౌమాన్ అలీ ఖాన్‌ గతేడాది మార్చి 23 అంటే పాకిస్తాన్ నేషనల్ డే సందర్భంగా ఎఫ్-16 యుద్ధ విమానంను నడుపుతున్న వీడియో ఒకటి బయటపడింది.

ఎఫ్-16 యుద్ధ విమానం నడిపిన వింగ్ కమాండర్ నౌమాన్ అలీఖాన్

ఎఫ్-16 యుద్ధ విమానం నడిపిన వింగ్ కమాండర్ నౌమాన్ అలీఖాన్

ఎఫ్-16 యుద్ధ విమానం నడిపిన వీడియో మొదటి రుజువు కాగా... 2010లో అమెరికా పాక్ మధ్య జరిగిన మిలటరీ విన్యాసాల సందర్భంగా నౌమాన్ అలీఖాన్ ఎఫ్-16 యుద్ధ విమానంను నడిపిన వీడియో కూడా బయటపడింది. 2018లో నౌమాన్ అలీఖాన్ యూనిఫాంపై ప్యాచ్ కనిపించింది. దానిపై ఎఫ్- 16 అని ఉంది. ఇక భారత్‌పై జరిగిన దాడి తర్వాత అంటే ఐదురోజులకు పాక్ ఎయిర్ ఛీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వర్ ఖాన్ ....నౌమాన్ అలీఖాన్‌ను అభినందించారు. ఆ వీడియోలో కూడా తాను వేసుకున్న యూనిఫాం పై ఎఫ్-16 పాచ్ కనిపిస్తోంది.

యూనిఫాంపై ఎఫ్-16 పాచ్‌తో కనిపించిన నౌమాన్ అలీ ఖాన్

యూనిఫాంపై ఎఫ్-16 పాచ్‌తో కనిపించిన నౌమాన్ అలీ ఖాన్


ఇదిలా ఉంటే ఫిబ్రవరి 27న పాకిస్తాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఓ ప్రకటన చేస్తూ భారత్ వాస్తవాలు చెప్పడం లేదని అసలు పాక్ వాయుసేన ఎఫ్ 16 యుద్ధ విమానాలను ఆపరేషన్ కోసం వినియోగించలేదని చెప్పారు. కానీ ఆపరేషన్ జరిగిన ఐధురోజుల తర్వాత వింగ్ కమాండర్ నౌమాన్ అలీఖాన్‌‌ను పాక్ ఎయిర్ ఛీఫ్ అభినందిస్తున్న సమయంలో తన యూనిఫాంపై ఎఫ్-16 పాచ్ ఉంది. దీంతో మరోసారి పాక్ తమను తాము డిఫెన్స్ చేసుకునే క్రమంలో వాస్తవాలను దాస్తోందన్న విషయం బుట్టదాఖలైనట్లయ్యింది. ఇక పాకిస్తాన్ ఎయిర్‌ ఛీఫ్‌తో రెండు సార్లు కలిసిన నౌమాన్ అలీ ఖాన్ ఆ రెండు సందర్భాల్లోను తన యూనిఫాంపై ఎఫ్-16 పాచ్ ఉండటం కనిపించింది. అంతేకాదు తనకు 2000 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు ప్యాచ్ పై ఉంది.

పాక్ ఎయిర్‌ఛీఫ్ మార్షల్ అభినందిస్తున్న ఫోటో విడుదల

పాక్ ఎయిర్‌ఛీఫ్ మార్షల్ అభినందిస్తున్న ఫోటో విడుదల

ఇక 2010లో అమెరికా పాకిస్తాన్ నిర్వహించిన సంయుక్త మిలటరీ విన్యాసాలకు సంబంధించి అమెరికా వీడియో విడుదల చేసింది. అందులో కూడా నౌమాన్ అలీ ఖాన్ ఎఫ్-16 యుద్ధ విమానంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎఫ్-16 యుద్ధ విమానం నడిపిన వారు మరో యుద్ధ విమానం నడపకూడదని ఎక్కడా లేదనే వాదన తీసుకొచ్చారు పాకిస్తాన్ మాజీ డిఫెన్స్ నిపుణులు అలీ. అయితే పాక్ దాడికి యత్నించిన రోజున పాక్ వింగ్ కమాండర్ యూనిఫాంపై ఎఫ్-16‌ పాచ్ ఉంది. అంతేకాదు ఎయిర్ ఛీఫ్‌ మార్షల్ ముజాహిద్ అన్వర్ ఖాన్‌ను కలిసిన రోజున కూడా యూనిఫాంపై ఎఫ్-16 పాచ్ ఉంది. ఇన్ని రుజువులు ఉన్నప్పటికి కూడా పాక్ మాత్రం తాము దాడులకు వినియోగించింది ఎఫ్ -16 యుద్ధ విమానాలు కాదని అడ్డంగా వాదిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+