600 డ్రోన్లతో పాక్ అటాక్ - బీఎస్ఎఫ్ ఐజీ
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ భారీ స్థాయిలో డ్రోన్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిని విజయవంతంగా ఎదుర్కొంది. కాగా ఇప్పుడు ఆ విషయాల గురించి బీఎస్ఎఫ్ గుజరాత్ ఐజీ అభిషేక్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఆపరేషన్ సిందూర్ సమయంలోనే పాకిస్థాన్ 600 కంటే ఎక్కువ డ్రోన్లను భారత సరిహద్దుల్లోకి పంపిందని తెలిపారు. కానీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని సమర్థవంతంగా కూల్చి వేసిందని పేర్కొన్నారు.
మే 8 తర్వాత పాకిస్థాన్ డ్రోన్లు పని చేయలేదని.. వారి డేటా, ప్రణాళికలన్నీ మన డిఫెన్స్ ముందు విఫలమయ్యాయని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా, పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. పాక్ ప్రయోగించిన 600 డ్రోన్లలో సుమారు 200 డ్రోన్లు గుజరాత్ భూభాగంలోకి ప్రవేశించాయని.. అయినా అవి ఎలాంటి నష్టం కలిగించలేదని ఐజీ వివరించారు.

అలానే ఆపరేషన్ సిందూర్‌లో మహిళా జవాన్లు కీలక పాత్ర పోషించారని పాఠక్ చెప్పారు. 800 మందికి పైగా మహిళా బీఎస్ఎఫ్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొనగా.. ముఖ్యంగా క్రీక్ ప్రాంతంలో అసిస్టెంట్ కమాండెంట్లు అమన్‌దీప్, నీతి యాదవ్ తమ బెటాలియన్లకు సమర్థ నాయకత్వాన్ని చూపినట్లు కొనియాడారు.
మరోవైపు ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు తీవ్రమైన నష్టం జరిగిందని ఐజీ తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 20 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని వివరించారు. అలాగే పాకిస్థాన్ ఆర్మీకి చెందిన 35 నుంచి 45 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితుల్లోనే గుజరాత్‌లోని కచ్ జిల్లాతో పాటు రాజస్థాన్‌లోని బార్మేర్ వరకు బీఎస్ఎఫ్ నిరంతర పహారాతో నిఘా కొనసాగుతుందని పాఠక్ తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications