Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యుద్దం తప్పదా...? బాలిస్టిక్ మిసైల్‌‌ను ప్రయోగించిన పాకిస్థాన్ ... వీడీయో

అక్టోబర్‌లో యుద్దం జరుగుతుందని హెచ్చరించిన పాకిస్థాన్ అందుకు సంబంధించిన అస్త్రాలను సిద్దం చేసుకుంటుందా...? ఓవైపు భారత సరిహద్దులోకి పాకిస్థాన్ కమాండోలను పంపిస్తున్న పాకిస్థాన్, మరోవైపు మిసైల్స్‌ను కూడ పరీక్షిస్తోంది. ఈనేపథ్యంలోనే గురువారం తెల్లవారుజామున 300 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి ఘజ్నావి ప్రయోగాన్ని పరీశీలించింది. కాగా ఈ మిసైల్ 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేధించనుంది.

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు పాకిస్థాన్ చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే యుద్ద ఘంటికలు మ్రోగించిన పాకిస్థాన్ గురువారం తెల్లవారుజామున ఉపరితల బాలిస్టిక్ క్షిపణి ఘజ్నావిని ప్రయోగం చేసింది. కాగా ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం అయిందని పాకిస్థాన్ సాయుధ దళాల ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. ఇందుకు సంభంధించి ముప్పై సెకన్ల వీడీయోను కూడ విడుదల చేశారు. ఇక ప్రయోగం విజయవంతం కావడంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంబంధిత టీంకు అభినందనలు కూడ తెలిపారు.. ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి 290 కి.మీ మేర వార్‌హెడ్స్‌ను తీసుకుపోగలదు.

 Pakistan carried out a night training launch of surface to surface ballistic missile Ghaznavi,

కశ్మీర్ సమస్యను దౌత్య స్థాయిలో అంతర్జాతీయ చేయడంతోపాటు ఇరు దేశాల మధ్య అణు యుద్ధం యొక్క భయాన్ని పెంచడం కోసం క్షిపణి ప్రయోగాలు చేస్తున్నట్టు పలువురు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇంతకుముందు పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రశీద్ ఇందుకు సంబంధించి ప్రకటన కూడ చేశాడు. ఆక్టోబర్‌లో ఇండియా పాకిస్థాన్‌ల మధ్య చివరి యుద్దం జరగనుందని హెచ్చరించాడు. దీంతో ఇరు దేశాల సరిహద్దుల మధ్య టెన్షన్ వాతవరణం నెలకొంది. ఇక ఆర్టికల్ 370 రద్దు నుండి పాకిస్థాన్ ఇలాంటీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే... పాకిస్థాన్ భావిస్తున్నట్టు కశ్మీర్ ఇరు దేశాలు ద్వైపాక్షిక అంశమని భారత్ తేల్చి చెబుతోంది. కాని పాకిస్థాన్ మాత్రం కశ్మీర్‌ను అంతర్జాతీయ అంశంగా చేసే ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+