'వాళ్లు టెర్రరిస్టులను పంపిస్తే.. మీరు బిర్యానీ పెడతారా'..? పాక్ మంత్రి భారత్ పర్యటనపై కాంగ్రెస్ ఫైర్..

దేశ రాజధాని దిల్లీలో నవంబర్ 20 నుంచి 22 వరకు షాంఘై సహకార సంస్థ (SCO) సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఈ సాంస్కృతిక వేదికకు, బహుపాక్షిక నిబంధనల ప్రకారం SCO లోని మొత్తం 10 సభ్య దేశాలకు భారత్ ఆహ్వానాలను పంపించింది. అందులో పాకిస్థాన్ కూడా ఉంది. దిల్లీలో రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ తరఫున ఆ దేశ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ హాజరుకానున్నారు.

అయితే గత మూడేళ్ల కాలంలో ఒక పాకిస్థాన్ మంత్రి భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి.. పైగా ముసాదిక్ మాలిక్ గతంలో పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు సింధు జలాల పంపిణీని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ కు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న చేతులను నరికివేయాలని తీవ్రమైన పదజాలంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి పాకిస్థాన్ తరఫున భారత్ కు రానున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోంది.

పాకిస్థాన్ తో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం SCO సమావేశానికి ఆ దేశాన్ని ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఓవైపు పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాల్లో మునిగి తేలుతుంటే ఆ దేశాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించింది. భారతీయులను చంపేందుకు పాకిస్థాన్ అప్పుడు ఉగ్రవాదులను పంపించిందని.. ఇప్పడు ఆ దేశ నేతకు స్వాగతం పలికి బిర్యానీ పెట్టండంటూ ఎద్దేవా చేసింది. ఇక ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ.. SCO సమావేశంలో పాకిస్థాన్ హాజరుకావడం సాధారణమైన విషయమే కానీ.. పాకిస్థాన్ విషయంలో భారత్ ఆందోళన మాత్రం అలాగే ఉంది. సరిహద్దు ఉగ్రవాదంపై ఇస్లామాబాద్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

Pakistan minister Invite and serve them biryani Congress lashes out at the Centre SCO summit news

పహల్గామ్ ఉగ్రదాడి నుంచి పాకిస్థాన్ లో ఎలాంటి మార్పు రాలేదని ఉగ్రవాదం నిర్మూలనకు ఆ దేశం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక బెంగాల్ మంత్రి, బీజేపీ నేత దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ తన సొంత లాభాల కోసమే భారత్ తో సత్సంబంధాలు కొనసాగించాలని చూస్తోందని అన్నారు. భారత్ తో ఘర్షణల వల్ల ఆ దేశమే నశిస్తుందని పేర్కొన్నారు. గతంలో వాళ్లు ఉగ్రవాదులను పెంచి పోషించారని.. ఇప్పుడు వాళ్లే పాకిస్థాన్ లోని పోలీస్ స్టేషన్లలోకి చొరబడి పోలీసులను హతమారుస్తున్నారని.. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారని స్పష్టం చేశారు. పాకిస్థాన్ లో లా అండ్ ఆర్డర్ లేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+