World Cup 2023: హైదరాబాద్ ఆతిథ్యంతో ఉబ్బితబ్బిబ్బవుతోన్న పాక్ ఆటగాళ్లు..
వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ లో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు.. తమకు లభించిన ఆతిథ్యానికి ఉబ్బితబ్బిబ్బవుతోంది. పాకిస్థాన్ జట్టు సెప్టెంబర్ 27న హైదరాబాద్ లో అడుగుపెట్టింది. అప్పటి నుంచి హైదరాబాద్ లో పాక్ జట్టుకు అద్భుతమైన ఆతిథ్యం లభిస్తోంది. తమకు చేస్తున్న మర్యాదలపై పాకిస్థాన్ క్రికెటర్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఆనందం వ్యక్తం చేశాడు. మంగళవారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం రిజ్వాన్ మీడియాతో మాట్లాడారు.
"ఆతిథ్యం.. మీరందరూ చూసే ఉంటారు. మేము విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఎవరో ఆ దృశ్యాన్ని ఫొటోలు తీశారు. రావల్పిండిలో జనం ముందు ఆడుకుంటున్నట్లు అనిపించిందని ముందే చెప్పాను. లాహోర్‌లోని మా మైదానం పెద్దది, చాలా మంది అక్కడికి వస్తారు, కానీ ఈ రోజు రావల్పిండిలో పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది" అని రిజ్వాన్ చెప్పారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ సపోర్ట్ చేసేందుకు చాలా మంది ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు.

పాక్ జట్టు సభ్యులను ఎంకరేజ్ చేశారు. కాగా దయాది జట్టు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి వారికి మంచి ఆతిథ్యం లభించింది. హైదరాబాద్ విమానాశ్రయంలో పాక్ బృందానికి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని 'జువెల్ ఆఫ్ నిజాం', పెషావర్ సహా పలు రెస్టారెంట్లలో పాకిస్థాన్ జట్టు సభ్యులు బిర్యానీ తింటూ కనిపించారు. అలాగే వారు హైదరాబాదీ వంటకాలను ఆస్వాదించడమే కాకుండా అభిమానులతో మాట్లాడారు.
మంగళవారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం కొంత పాక్ ఆటగాళ్లు స్టేడియం సిబ్బందితో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ జట్టుకు హైదరాబాద్‌లో మంచి ఆతిథ్యం లభించిందని ఇప్పటికే మహ్మద్ రిజ్వాన్ తో పాటు మరికొంత ఆటగాళ్లు చెప్పారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి.
🎥 Hangout in Hyderabad: Glimpses from the Pakistan team dinner 🍽️#CWC23 pic.twitter.com/R2mB9rQurN
— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2023
ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా ప్రేక్షుకులు వచ్చే అవకాశం ఉంది. కాగా పాకిస్థాన్ ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 4 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.












Click it and Unblock the Notifications