మేము ఓడిపోయాం.. ఒప్పుకుంటున్నా.. చైనీస్, టర్కీ ఆయుధాలు ధ్వంసం: పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై పాకిస్థాన్ అబద్దాలు చెప్పుకుంటూ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ ఏమీ కోల్పోలేదని.. యుద్ధం తామే గెలిచామని.. భారత్ కే నష్టం వాటిల్లిందంటూ ఇన్నిరోజులూ బుకాయిస్తూ వచ్చింది. అయితే తాజాగా తన ఓటమిని పాకిస్థాన్ అంగీకరించింది. భారత్ దెబ్బకు తాము ఓడిపోయామని బహిరంగంగానే ఆ దేశ ప్రధాని ఒప్పుకున్నారు.

ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. అత్యాధునిక క్షిపణులతో భారత్ చేపట్టిన దాడికి పాకిస్థాన్ అతలాకుతలం అయింది. ఆ దేశంలోని అనేక మిలిటరీ స్థావరాలపై భారత్ దాడులు చేసి కోలుకోలేని దెబ్బ తీసింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఇన్ని రోజులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని విక్టరీ ర్యాలీలు కూడా తీసింది. తాజాగా తన తప్పు తెలుసుకున్న పాకిస్థాన్.. ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. తాము ఓడిపోయామని స్వయంగా ఆ దేశ ప్రధాని బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Pakistan PM Admits Defeat in Operation Sindhur Says Indian Forces Destroyed Chinese Turkish Weapons

ఆపరేషన్ సిందూర్ లో భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒప్పుకున్నారు. శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రధాని షెహబాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. "మే 9,10 మధ్య రాత్రి భారత్‌ దాడులు ప్రారంభించాక ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. రావిల్పిండి లోని నూర్ ఖాన్‌ మిలిటరీ ఎయిర్ బేస్ తో పాటు ఇతర స్థావరాలపై దాడి జరిగింది. ఆ సమయంలో మా వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనా యుద్ధ విమానాలను వినియోగించింది. అని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ తెలిపారు.

మరోవైపు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 600 పాకిస్థాన్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా నేల కూల్చిందని కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. దేశ సరిహద్దులో వేయికి పైగా ఏడీ గన్ సిస్టమ్స్, 750 షార్ట్ అండ్ మీడియం రేంజ్ సర్ ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్స్ మోహరించామని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ లో ఆ నాలుగు రోజులు వీరోచితంగా పోరాటం చేశామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+