కాశ్మీర్: పాక్‌పై ఆర్మీచీఫ్, మోడీ కంటే గత ప్రభుత్వం సున్నితం: పాక్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో ప్రచ్ఛన్న యుద్ధానికి పాకిస్తాన్ మద్దతిస్తోందని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహగ్ మంగళవారం అన్నారు. గత ఏడాది 104 మంది ఉగ్రవాదుల చొరబాటును నియంత్రించగలిగామని చెప్పారు. భారత సైన్యాన్ని ఆధునికీకరించవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
లైన్ ఆఫ్ ది కంట్రోల్ (ఎల్ఓసీ) వద్ద భారీగా ఆర్మీ గార్డులు ఉండటంతో పాకిస్తాన్ తన దృష్టిని ఇంటర్నేషనల్ బార్డర్ పైన పెట్టిందని ఆరోపించారు. కాగా, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా చెందిన గత ఏడాది డిసెంబరు నెలలో కాశ్మీర్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది సైనికులు, ముగ్గురు పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత్ కాశ్మీర్ సమస్య పరిష్కారనికి సహకరించడం లేదని పాకిస్తాన్ సోమవారం నాడు ఆరోపించింది. జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల పైన పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆదివారం డాన్ పత్రికతో మాట్లాడారు.

భారత్‌లో గత ప్రభుత్వ వైఖరి సున్నితంగా ఉండేదని, మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలంటే పాకిస్తాన్ కాశ్మీర్ పైన రాజీ పడాల్సిందేనన్న వైఖరితో ఉందన్నారు.
భారత్ తన సొంత నియమ, నిబంధనలతో చర్చలు జరపాలని కోరుకుంటోందని, అది పాక్‌కు ఆమోదయోగ్యం కాదన్నారు. తమ దేశంలో దాడుల కోసం ఆప్ఘనిస్తాన్ భూభాగాన్ని భారత్ ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ బారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నారన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications