Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girl: ఐటీ హబ్ లో పాకిస్తాన్ యువతి అరెస్టు, నేపాల్ ఎంట్రీ, రిపబ్లిక్ డే ముందే ?, ములాయం సింగ్ లవ్ స్టోరి !

బెంగళూరు/పాకిస్తాన్/నేపాల్: పాకిస్తాన్ నుంచి ఎవరైనా భారత్ లోకి ప్రవేశిస్తారా ?, ఉగ్రవాదులు ఎప్పుడు ఏరూపంలో వస్తారో అని భారత సైనికులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పాక్-భారత్ సరహద్దులో రోజూ 24 గంటలు కళ్లు కాయలోకాచేలే చలిలో విధులు నిర్వహిస్తున్నారు. భారత్ దాయాది దేశం పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు వాళ్లు చేస్తున్న అరాచకాలు ఇంతాఅంతకాదు ప్రతినిత్యం వెలుగు చూస్తూనే ఉంది. జీహాద్ ముసుగులో భారత్ సైనికులను పాక్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకుంటున్నారు. ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఉన్నా పాకిస్తాన్ చెందిన యువతి చాకచక్యంగా ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని చాలాకాలంగా నివాసం ఉంటున్నదని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. అధికారుల విచారణలో ములాయం సింగ్ లవ్ స్టోరీ కూడా బయటకు వచ్చింది.

ఇంటెలిజెన్స్ నిఘా

ఇంటెలిజెన్స్ నిఘా

పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు వాళ్లు చేస్తున్న అరాచకాలు ఇంతాఅంతకాదు ప్రతినిత్యం వెలుగు చూస్తూనే ఉంది. జీహాద్ ముసుగులో భారత్ సైనికులను పాక్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకుంటున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద, వారి కదలికల మీద, భారత్ లో ఎవరెవరికి పాక్ ఉగ్రవాదులు సంప్రధిస్తున్నారు, భారత్ కు చెందిన వాళ్లు పాకిస్తాన్ లో ఉన్న వారికి ఫోన్లు చేస్తున్నారా ? అంటూ ఇంటెలిజెన్స్ అధికారులు, ఐబీ వర్గాలు ప్రతినత్యం నిఘా వేస్తూనే ఉంది.

బెంగళూరులో పాక్ యువతి

బెంగళూరులో పాక్ యువతి

బెంగళూరులోని బెళ్లందూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్జాపుర రోడ్డులోని జున్నసంద్ర ప్రాంతంలో నివాసం ఉంటున్న పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవని (19) అనే యువతిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఇశ్రా జీవని పాకిస్తాన్ లోని ఆమె తల్లితో ఫోన్ లో మాట్లాడటానికి ప్రయత్నించింది. తరువాత ఇశ్రా పాకిస్తాన్ లోని ఆమె తల్లితో ఫోన్ లో మాట్లాడిందని తెలిసింది. విషయం తెలుసుకున్నర కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు పాకిస్తాన్ యువతి ఇశ్రా గురంచి బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హడలిపోయిన స్థానికులు

హడలిపోయిన స్థానికులు

బెంగళూరు పోలీసులు సర్దాపుర రోడ్డులోని జున్నసంద్రలో నివాసం ఉంటున్న పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవని మీద నిఘావేశారు. సోమవారం వేకువ జామున పోలీసులు పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవని, ఆమెతో పాటు నివాసం ఉంటున్న ములాయం సింగ్ అనే యువకుడిని అరెస్టు చేశారు. ఇంతకాలం మా మధ్య పాకిస్తాన్ యువతి నివాసం ఉందని తెలుసుకున్న జున్నసంద్ర పోలీసులు హడలిపోయారు.

డేటింగ్ యాప్ లవ్ స్టోరీ

డేటింగ్ యాప్ లవ్ స్టోరీ

ఉత్తరప్రదేశ్ కు చెందిన ములాయం సింగ్ అనే యువకుడికి, పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవనికి డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తరువాత ఇశ్రా జీవని, ములాయం సింగ్ ప్రేమించుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఇశ్రా జీవని నేపాల్ వెళ్లి తరువాత అక్రమంగా భారత్ లోకి వచ్చిందని, తరువాత ములాయం సింగ్ ను వివాహం చేసుకుందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

మేడమ్ పేరు మార్చుకుని పాస్ పోర్టుకు అర్జీ

మేడమ్ పేరు మార్చుకుని పాస్ పోర్టుకు అర్జీ

ములాయం సింగ్ ను వివాహం చేసుకున్న తరువాత ఇశ్రా జీవని ఆమె పేరు రావా యాదవ్ అని మార్చుకుందని పోలీసులు అన్నారు. ములాయం సింగ్ అతని భార్య, పాక్ యువతి ఇశ్రా జీవని అలియాస్ రానా యాదవ్ తో కలిసి బెంగళూరు చేరుకున్నారని పోలీసులు అన్నారు. రావా యాదవ్ పేరుతో పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవని పాస్ పోర్టు తీసుకోవడానికి ప్రయత్నిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

రిపబ్లిక్ డేకి మందు కలకలం

రిపబ్లిక్ డేకి మందు కలకలం

ములాయం సింగ్, పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవనిల మధ్య నిజంగా లవ్ స్టోరీ మాత్రమే ఉందా ?, లేక వీరి ప్రమవ్యవహారంలో ఏమైనా స్కెచ్ ఉందా అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. రిపిబ్లిక్ డేకి మూడు రోజుల ముందు ఐటీ హబ్ బెంగళూరు సిటీలో పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవని అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+