పాలమూరు వైద్య విద్యార్థి మృతి మిస్టరీ: నోట్ లభ్యం

చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డవారే కామేష్‌ను చంపేశారనే విషయంపై కూడా ఇంకా ఆధారాలు లభించలేదని ఆయన చెప్పారు. ఈ నెల 12వ తేదీన సాయి ప్రసాద్‌పై దుండగలు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.
మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న కామేష్ సాయి ప్రసాద్ ఆ రోజు రాత్రి సమయంలో దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతడి మెడలోని గోలుసును లాక్కోవడానికి ప్రయత్నించారని, అతను ప్రతిఘటించడంతో వారు నిప్పంటించారని వార్తలు వచ్చాయి. బెంగళూర్‌లని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మంగళవారం అసువులు బాశాడు.
కామేష్ తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణశర్మలు న్యాయవాదులుగా పని చేస్తున్నారు. లక్ష్మణ శర్మ కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగా జ్యోతి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications