పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లిన తమిళనాడు మంత్రులు: ఇక శశికళ, దినకరన్ పని ఫినిష్ !

అన్నాడీఎంకే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం కలిసిపోవడానికి రంగం సిద్దం అయ్యింది.

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం కలిసిపోవడానికి రంగం సిద్దం అయ్యింది. టీటీవీ దినకరన్ కు చెక్ పెట్టాలంటే కచ్చితంగా ఇరు వర్గాలు విలీనం కావాలని నిర్ణయించారని తెలిసింది.

మంగళవారం తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లి విలీనం విషయంలో ఆయనతో చర్చలు మొదలు పెట్టారు. ఎడప్పాడి పళనిసామి వర్గంలోని ఎంపీ వైద్యలింగం సైతం పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారని సమాచారం.

Palanisamy faction MP Vaithilingam and two ministers meet OPS

శశికళ ఫ్యామిలీని అన్నాడీఎంకే పార్టీకి దూరం చెయ్యాలంటే మొదటి నుంచి ఆ వర్గాన్ని వ్యతిరేకిస్తున్న మీరు విలీనం చర్చలకు సిద్దం కావాలని మంత్రులు వేలుమణి, తంగమణి పన్నీర్ సెల్వంకు నచ్చచెబుతున్నారని వెలుగు చూసింది. ఇప్పటికే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం రెండు వర్గాలు కలిసిపోవాలని సూచించారని తెలిసింది.

పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు సైతం విలీనం అయితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. మరో వైపు టీటీవీ దినకరన్ సైతం తన వర్గంలోని ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు. ఎలాగైనా ఆగస్టు 5వ తేదీ పార్టీ పగ్గాలు చేపట్టాలని దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీవీ దినకరన్ కు చెక్ పెట్టడానికి పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గం ఒక్కటి కావడానికి తొలిఅడుగు పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+