విధులకు పళ్లంరాజు దూరం, సిఎబిఇపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేసిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పళ్లంరాజు అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే గురువారం జరగనున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్(సిఏబిఈ) సమావేశానికి హాజరవుతారా లేదా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి.
దేశంలో విద్యకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కేంద్ర విద్య సలహా మండలి సమావేశానికి పదవికి రాజీనామా చేసిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పల్లం రాజు హాజరు అనుమానాస్పదంగా మారింది. అయితే ఈ సమావేశానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అధ్యక్ష్యత వహించాల్సి ఉంటుంది. ఒక వేళ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ సమావేశానికి పల్లం రాజు గైర్హాజరైనట్లయితే.. కేంద్రమంత్రులైన జితిన్ ప్రసాద్ లేదా శశిథరూర్ అధ్యక్షత వహించే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.

కాగా పల్లం రాజు మంగళవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. గత వారం రోజుల నుంచి ఆయన కార్యాలయానికి, అధికారిక కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. స్వయం ప్రతిపత్తి కళాశాలల ప్రిన్సిపాళ్లతో సోమవారం జరిగిన సమావేశానికి కూడా పల్లంరాజు హాజరు కాలేదు. తమిళనాడు పండితులకు రాష్ట్రపతి భవన్‌లో బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పురస్కారాలు ప్రదానం చేసే కార్యక్రమానికి కూడా పళ్లంరాజు హాజరవుతారో లేదో తెలియదు.
గత సోమవారం పల్లం రాజుతోపాటు మరో నలుగురు కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు రాజీనామా చేసి లేఖలను ప్రధాని మన్మోహన్ సింగ్‌కి అందించిన విషయం తెలిసిందె.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications