డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు బెయిల్ మంజూరు, అయినా జైల్లోనే
పంచకుల: డేరా సచ్చా సౌధ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరయింది. పంచకుల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఓ కేసులో ఆయనకు బెయిల్ మంజూరయినప్పటికీ, అత్యాచారం కేసులో ఆయన జైల్లోనే ఉండనున్నారు.
అంతకుముందు, ఆగస్ట్ 23వ తేదీన ఆయన బెయిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో డేరా బాబా స్పెషల్ సీబీఐ కోర్టు ఎదుట బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం సీబీఐ కోర్టు జడ్జి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

తన వద్ద పన చేసే ఇద్దరు సాద్విలపై అత్యాచారం కేసులో ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాబట్టి ఓ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ, ఆయన జైలు నుంచి బయటకు రాలేరు.












Click it and Unblock the Notifications