తమిళనాడు సీఎంకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పన్నీర్ సెల్వ వర్గం, అదే జరిగితే!

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఆ రాష్ట్ర మాజీ మంత్రి పాండియరాజన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలో మీరు చేరాలని ఎడప్పాడి పళనిసామిని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేపాండియరాజన్ ఆహ్వానించారు.

తమిళనాడు విద్యాశాఖ మాజీ మంత్రి, పన్నీర్ సెల్వం వర్గంలోని ఎమ్మెల్యే పాండియరాజన్ శుక్రవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ శశికళ నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులను వ్యతిరేకించే వారికి మా వర్గంలో ఎప్పుడూ స్థానం ఉంటుందని అన్నారు.

Pandiarajan has invited Edapadi Palanisamy to join OPS team to oppose Sasikala family.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి శశికళ కుటుంబ సభ్యుల తీరుతో విసుగుచెందారని మాకు సమాచారం వచ్చిందని, ఆయనకు అభ్యంతరం లేకపోతే పన్నీర్ సెల్వం వర్గంలో చేరి చిన్నమ్మ కుటుంబ సభ్యుల మీద పోరాటం చేస్తే మేము మద్దతు ఇస్తామని అన్నారు.

శశికళ వర్గంలో చివరి రోజు వరకు రిసార్టులో ఉన్న పాండియరాజన్ ఆఖరి క్షణంలో పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయారు. ఎమ్మెల్యే పాండియరాజన్ వ్యాఖ్యలతో శశికళ వర్గంలోని నాయకులు హడలిపోయారు. సీఎంనే పన్నీర్ సెల్వం వర్గంలో చేరాలని ఆహ్వానిస్తూ పాండియరాజన్ సంచల వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+