కలిసొచ్చిన సీఎం హోదా: శశికళకు చెక్ పెట్టేస్తోన్న పన్నీర్..

ఆపద్దర్మ సీఎం హోదాలో శశికళ ప్రయత్నాలన్నింటికి చెక్ పెట్టుకుంటూ వెళ్తున్నారు పన్నీర్. ఇదే క్రమంలో దూకుడైన నిర్ణయాలతో ఆయన ముందుకెళ్తున్నారు.

చెన్నై: తమిళ రాజకీయాల్లో క్షణ క్షణానికి రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎత్తులు పై ఎత్తులతో పన్నీర్-శశికళ ఒకరిని మించి ఒకరు తమ సత్తా ఏంటో చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న తరుణంలో.. ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటం పన్నీర్ కు కలిసొచ్చింది.

ఆపద్దర్మ సీఎం హోదాలో శశికళ ప్రయత్నాలన్నింటికి చెక్ పెట్టుకుంటూ వెళ్తున్నారు పన్నీర్. ఇదే క్రమంలో దూకుడైన నిర్ణయాలతో ఆయన ముందుకెళ్తున్నారు. డీజీపీ, సీఎస్ లతో సమావేశమై శశికళ రహస్య ప్రాంతానికి తరలించిన ఎమ్మెల్యేలందరిని బయటకు తీసుకురావాలని ఆదేశాలివ్వడం కూడా ఆయన ఎత్తులో భాగమే.

అంతకుముందు యలలిత మృతిపై విచారణ జరిపిస్తానని, ఆమె నివాసాన్ని మెమోరియల్ హాలుగా మారుస్తానని చెప్పి శశికళకు పన్నీర్ షాక్ ఇచ్చారు. ఆపై చాకచక్యంగా అన్నాడీఎంకె రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడలతో సాగుతున్నారు. ఇందుకోసం చేతిలో ఉన్న సీఎం అధికారాలను ఆయన పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు.

Panneer selvam using his CM Powers to stop sasikala

పన్నీర్ దెబ్బకు శశికళ వర్గం నుంచి ఒక్కో ఎమ్మెల్యే అవుట్ అవుతుండటంతో ఆయన శిబిరంలో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి.

సీఎం హోదాలో గవర్నర్‌కు ఆహ్వానం పలికేందుకు:

గవర్నర్ చెన్నైలో అడుగుపెట్టాక.. పన్నీర్-శశికళలల్లో ఎవరికి తొలుత కబురు పెడుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొనగా.. తనకున్న ఆపద్దర్మ సీఎం హోదాను ఉపయోగించుకుని.. విమానశ్రయంలో గవర్నర్ కు స్వాగతం పలికేందుకు వెళ్లాలని పన్నీర్ నిర్ణయించుకున్నారు.

పన్నీర్ వేసిన ఈ ఎత్తుగడతో గవర్నర్‌తో తొలుత భేటీ అయ్యే అవకాశం ఆయనకే దక్కినట్టు తెలుస్తోంది. తమిళ రాజకీయాల్లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న కీలక పరిణామాల గురించి గవర్నర్ కు వివరించి బల నిరూపణకు అవకాశమివ్వాల్సిందిగా పన్నీర్ గవర్నర్ ను కోరనున్నారు.

సీఎం హోదాలో ఉండటంతో పన్నీర్ కే తొలుత గవర్నర్ తో భేటీ అయ్యే అవకాశం వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పన్నీర్ ఇప్పటికే రాజీనామా చేశారు కాబట్టి.. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని భావిస్తే.. శశికళకు తొలుత గవర్నర్ అవకాశం ఇవ్వవచ్చనేది మరికొందరి వాదన.

కాగా, గవర్నర్ విద్యాసాగర్ మాత్రం ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాతే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ఓ అంచనాకు రానున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+